Episode1:విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత - పాపముల నుండి విడుదల
Audio: https://youtu.be/HlaBq5QqWBc
హెబ్రీ 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
రక్షించబడిన ప్రతి వ్యక్తి విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగియుండాలి. ఎందుకు కలిగియుండాలి? హెబ్రీ 3:15 ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
తీతు 3: 3,4,5
1. అవివేకులమును - not understanding, thoughtless, తెలివితక్కువవారు
2. అవిధేయులమును - లోబడనివారము
3. మోసపోయిన వారమును - సాతాను చేత
4. నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి - చెడు కోరికలకు, లోక సంబంధమైన కోరికలు కలిగినవారము
5. దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉన్నాము.
కొలస్సి 1:21 మునుపు దేవునికి దూరస్థులము, ఎఫెసీ 4:17 అన్యజనులు నడుచుకొనునట్లు మనం నడుచుకున్నాము. అన్యజనులు ఎలా నడుచుకున్నారంటే - వారి మనస్సు అంధకారం, వారి హృదయం కఠినమైనది, వారి మనస్సు వ్యర్థమైనవాటిని అనుసరిస్తుంది కాబట్టి జీవము నుండి వేరుచేయబడ్డారు. ఎఫెసీ 2:12 ఇశ్రాయేలుతో సహపౌరులము కాక - పరదేశులును, వాగ్దానము లేనివారము, నిరీక్షణలేనివారము, లోక మందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులమైయున్నాము. ఇలాంటి స్థితిలో ఉన్న మన కొరకు దేవుని ప్రేమ ప్రత్యక్షమైనది. రోమా 5:8 ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. ఆయన మరణం ద్వారా మన జీవితంలో కలిగిన అద్భుతమైన ఆశీర్వాదం. ఎఫెసీ 2:19 పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నాము. కొలస్సి 1:22 పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేసి తండ్రితో సమాధానపరిచాడు.
Read Next Episode 2..click here