పగిలిన హృదయం
Audio: https://youtu.be/dmJtagMNdOc
కీర్తనలు 51:17 విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
దేవునికి విరిగిన (పగిలిన) మనస్సు, నలిగిన హృదయం ఇష్టమైనవంటా. ఈ వాక్యంలో నాకు అర్ధమైన భావం - దేవుని సంతోషపెట్టాలంటే ప్రతి విశ్వాసి హృదయం విరిగిపోవాలి, నలిగిపోవాలి. ఈ వాక్యం మొదట చదివినప్పుడు దేవుడు ఇంత కఠినమైనవాడా అనుకున్నాను కాని, అనుభవాలగుండా వెళ్ళినప్పుడు దేవుని ప్రేమ అర్ధమైనది. ఒక మనిషి హృదయం ఎప్పుడు పలిగిలిపోతుంది, ఎప్పుడు నలిగిపోతుంది? నాది అనుకున్నవారు, ప్రేమించినవారు దూరమైనప్పుడు హృదయం విరిగిపోతుంది (పగిలిపోతుంది). శ్రమలు, సమస్యలలో ఉన్నపుడు అందరు ఉండి ఎవరు సహాయం చేయక ఓంటరియైనప్పుడు, అర్ధం చేసుకోవలసినవారు నిందలు వేసినప్పుడు హృదయం నలిగిపోతుంది. ఈ బాధ ఎలా ఉంటుందో మనం ఆరాధిస్తున్న త్రియేక దేవుడు అనుభవించాడు. ఆదాము మోసం చేసి దూరమైనప్పుడు తండ్రియైన దేవుని హృదయం పలిగిలిపోయింది, నలిగిపోయింది. నమ్మిన శిష్యులు, వెంబడించిన శిష్యులు, 3 1/2 సం।।లు అన్ని పంచుకున్న శిష్యులు మోసం చేసి దూరమైనప్పుడు యేసయ్య హృదయం పలిగిలిపోయింది, నలిగిపోయింది. ఇప్పుడు ప్రతి విశ్వాసి అనేకసార్లు మాటవినక లోబడక ఎదురుతిరిగుట వలన పరిశుద్ధాత్ముడు ఎన్ని సార్లు దుఖఃపడ్డాడో. ఆ నొప్పి ఎరిగిన దేవుడు, అలాంటి పరిస్థితిలో ఉన్నవారిని అలక్ష్యము చేయనని మాటయిచ్చాడు.
నేను నా వ్యక్తిగత జీవితములో ఇలాంటి అనుభావలగుండా వెళ్ళినప్పుడు నేను ఎమిచేసానని నాకు ఈ పరిస్థితి కలిగిందని బాధపడ్డాను కాని, ఆ పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడే దేవుని ప్రేమను అనుభవించగలిగాను. ఆ బాధను అనుభవించి దేవుని వాక్యం బోధిస్తాను కాబట్టే నేను ప్రకటిస్తున్న
దేవుని వాక్యం మీరు వింటున్నప్పుడు మీ హృదయాలకు తాకుతుంది. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నీ హృదయం విరిగి నలిగియున్నదా? భయపడకు, బాధపడకు విరిగి నలిగిన మనస్సే ఆశీర్వాదమునకు కారణం, అది దేవుని ఇష్టమైనది. దేవుని మీద ఆధారపడి, దేవుని కొరకు జీవిస్తున్న నీ హృదయం విరిగిందంటే, నీవు అద్భుతమైన, శక్తివంతమైన స్థితికి చేరుకోబోతున్నావు...!