సహిస్తేనే అద్భుతం


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

సహిస్తేనే అద్భుతం
Audio: https://youtu.be/umuHieMuFas

2 తిమోతి 2:11 ఈ మాట నమ్మదగినది, ఏదనగామన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము.
2:12 సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.

11వ వచనములో పాపము నుండి విడుదల కనిపిస్తుంది
12వ వచనములో పరలోక స్వాస్థ్యము కనిపిస్తుంది

ఈ లోకంలో పాపం నుండి విడుదల పొందుకొని పరలోకం చేరడానికి చేసే ప్రయాణంలో మధ్యలో ఉండే వారధే సహనం

విడుదలకి, పరలోక రాజ్యానికి మధ్యలో సహనం ఉంది.
సహనంలేని విశ్వాస జీవితం వ్యర్ధం

లోకంలో మీకు శ్రమని యేసు ప్రభువే చెప్పారు.
1 పేతురు 2:20,21లో విశ్వాసి మేలు చేసి బాధపడాలి, ఆ బధ సహించాలి. అందుకేసమే పిలువబడినామని పేతురు తెలియజేసాడు.

సహించేవాడు ఆయనతో కూడ ఏలుదుమని పౌలు చెప్పుచున్నాడు. ఏలడమంటే దేవునితోపాటు పరిపాలన చేస్తాము.
ఈ వాక్యములలో మన కొరకు దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఎంత ఉన్నతముగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలలో, నిందలలో కావలసింది సహనం.
సహించేవాడే వాగ్ధానమును అనుభవించగలడు
సహించేవాడే విశ్వాసములో అభివృద్ధిని చూడలడు
సహించేవానికే కిరీటం, సహిస్తేనే పరలోకరాజ్యము.

ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న సమస్యలలో వెనకడుగు వేయక సహనముతో ముందుకు వెల్తె అద్భుతమును చేస్తావు.