నీతో నడిచే దేవుడు
Audio: https://youtu.be/nR7A_Qegn5k
Gen 24:7 ...ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును;
~ ఇస్సాకునకు పెండ్లి చెయ్యాలి
~ దాదాపు 65 సంవత్సరములు అయ్యింది అబ్రాహాము తన స్వజనమును విడిచి.
~ కనాను స్త్రీలలో ఎవరికిచ్చి ఇస్సాకునకు పెండ్లి చేయడం అబ్రాహామునకు ఇష్టంలేదు.
~ ఇస్సాకునకు సంబంధం చూచుటకు తన దాసుని పంపిస్తూ చెప్పిన మాటలు ఇవే ‘యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును’.
ఇక్కడ అబ్రహం అనుభవం బట్టి మాట్లాడుతున్నాడు
తానూ పొందబోయే భూమిలో అబ్రాహాము విశ్వసముతో 65 సంవత్సరములు చేసిన ప్రయాణములో దేవుడు తన దూతను ముందు నడిపించి అనేకమైన క్లిష్టపరిస్థితిలో దేవుడు తనను అద్భుతముగా కాపాడినాడు. అదే మార్పులేని దేవుడు నేడు నీవు చేస్తున్న ఈ ప్రయాణంలో కూడా నడిపించగలడు, కాపాడగలడు.
Exo 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.
Exo 33:2 నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను.
ఇవి ఇశ్రాయేలీయుతో చేసిన వాగ్ధానములు
Psa 32:8 నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
Psa 34:7 యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
ఇవి భయభక్తులుగలవారితో చేసిన వాగ్ధానములు
ఈ వాగ్ధానములు నమ్మి నీవు కూడా ఏ పని కొరకైనా బయటకు వెళ్ళ్తున్నప్పుడు ప్రార్ధన చేసుకొని వేళ్ళు అబ్రాహామునకు సహాయం చేసిన దేవుడు నీకు అద్భుతముగా సహాయం చేయగలడు. ఆమెన్.