నమ్మికమాత్రముంచుము
యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవావానికి ఆశ్రయముగా ఉండును. యిర్మియా 17:7
ఈ లోకయాత్రాలో నే సాగుచుండగ ఒకసారి నువ్వు ఒకసారి ఏడ్పు అయిననూ యేసుక్రీస్తు నా తోడై ఉండును అని భక్తుడు చెప్పిన రీతిగా ఒక్కోసారి కష్టాలు, నష్టాలు మన జీవితాన్ని కుదిపేస్తుంటాయి.
మన జీవితంలో భంగపాటు, కృంగుదలల ద్వారా అపవాది మనలను నిర్వీర్యం చేయడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాడు.
నిజానికి, దేవుని నమ్ముకుని ఆయనతో కలిసి పనిచేయడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. మనము సంతోషకరమైన సాఫల్యం కలిగిన ప్రభావవంతమైన జీవితాన్ని జీవించగలం.
అయితే మనం ప్రాముఖ్యమైన రెండు ప్రశ్నలను వేసుకోవాలి. మనం ఏమి నమ్ముతున్నాం మరియు మనం నమ్మిన దానిని ఏవిధంగా పాటిస్తున్నాం. కొన్నిసార్లు మనం ఒకటి నమ్ముతాం, మరొకటి చేస్తాం. ఒకవైపు రక్షకుడైన యేసుక్రీస్తును నమ్ముతున్నాం మరోవైపు లోకాన్ని వెంబడిస్తాం.
లూకా 8:49 "నమ్మికమాత్రముంచుము" అని ప్రభువు మనకు సెలవిస్తున్నారు
నమ్మువానికి సమస్తమును సాధ్యమే.
https://youtu.be/nARfLWeRyr4