రోజుకు పదిహేను నిమిషాలు!
ప్రపంచంలోని సాహిత్యాన్ని ప్రతి రోజు కొన్ని నిమిషాలపాటు చదివితే, సాధారణ జనులు విలువైన విద్యను అభ్యసించిన వారావుతారు అని హార్వర్డ్ యూనివర్సిటీ లో అధ్యక్షుడిగా పనిచేసిన డా. సి. డబ్ల్యు. ఇలియట్ విశ్వసించేవారు. 1990వ సంవత్సరంలో “హార్వర్డ్ క్లాసిక్స్” అనే పేరుతొ ఆయన ఒక సంపుటిని ప్రచురించారు. ఈ సంపుటిలో ముఖ్యంగా చరిత్ర నుండి, సైన్సు నుండి, ఫిలాసఫీలో నుండి మరియు ఫైన్ ఆర్ట్స్ వంటి గ్రంథాల నుండి ఎంపిక చేసిన కొన్నింటిని కూర్చి యాభై సంపుటములుగా సమకూర్చారు. రోజుకు పదిహేను నిమిషాలు ఈ సంపుటిని చదువగలిగితే ఒక్క సంపత్సరంలో విలువైన విషయాలు నేర్చుకోగలరని ఆయన ఉద్దేశం.
ప్రపంచంలో అన్నిటి కంటే అద్భుతమైన గ్రంథం ఒకటి ఉంది, దానిని చదువుచున్నప్పుడు, ఎల్లప్పుడూ గ్రంథకర్త మనతో ఉండే అ ఏకైక గ్రంథమే బైబిల్.
అయితే, రోజుకో పదిహేను నిమిషాలు దేవుని వాక్యాన్ని చదవడంలో గడిపితే ఏమవుతుంది?
“లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము”. (కీర్తన 119:36-37) అని కీర్తనా కారుడితో మనమూ చెప్పగలిగితే, మనం రోజు గడపగలిగే పదిహేను నిమిషాలు సంవత్సరానికి 91 గంటలౌతుంది. క్రమం తప్పకుండా పాటించడమే నా యీ ఉద్దేశం. ఎక్కువసేపు దేవుని వాక్యం చదివేవారు తప్పకుండా మనలో అనేక మంది ఉంటారు, ఇక్కడ ముఖ్యమైన భాగం సంపూర్ణత కాదు గాని నిలకడగా చదవడం. ఒక రోజు గాని, ఒక వారం గాని, చదవడం తప్పినట్లయితే మరలా చదవడం మొదలుపెట్టవచ్చు. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించే కొలది, దేవుని వాక్యమును మన మనసుల నుండి మన హృదయాలకు చేరుతుంది. అక్కడ నుండి చేతులకు కాళ్ళకు చేరి విద్యనభ్యసించటానికి మించినటువంటి పరివర్తనకు తీసుకొని వెళుతుంది.
నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. (కీర్తన 119:33)
Audio: https://youtu.be/yC8aHsbaxw8