నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు. కీర్తనలు 144:1
పక్షిరాజు సర్పముతో నేలపై పోరాటం చేయదు. అది దానిని ఆకాశంలోకి ఎత్తి యుద్ధ మైదానాన్ని మార్చేస్తుంది, ఆపై సర్పమును ఆకాశంలోకి విడిచిపెట్టేస్తుంది. సర్పమునకు గాలిలో సత్తువ ఉండదు, శక్తి ఉండదు మరియు ఆధారం దొరకదు. భూమిపై ఉన్నట్లు తెలివైనదిగా, బలమైనదిగా కాక నిస్సహయమైన స్తితిలో పనికిమాలినదిగా మారిపోతుంది.
ప్రార్థన ద్వారా మీ పోరాటాన్ని ఆధ్యాత్మిక స్థితికి తీసుకెళ్లండి. ఆధ్యాత్మికంగా మీరు ఉంటున్నప్పుడు దేవుడు మీ యుద్ధాలను అందుకుంటాడు.
శత్రువుకు అనువైన యుద్ధభూమిలో మీరు పోరాడవద్దు, పక్షిరాజువలె యుద్ధ రంగాన్ని మీకు అనువుగా మార్చి మీ హృదయపూర్వక ప్రార్థన ద్వారా దేవునిని పోరాడనివ్వండి.
నిశ్చయముగా మీకు విజయమే!!
Audio: https://youtu.be/gGwIlsTZRNo
Telugu Devotions:http://www.sajeevavahini.com/Content.aspx?c=14
More Audio Devotions: https://www.youtube.com/SajeevaVahini