పట్టుదల సహనం విశ్వాసం ఇవే మనల్ని ఒక ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఆ స్థాయి వచ్చాక అప్పుడు ఉండే ధైర్యం అంతా ఇంతా కాదు. ఏదైనా సాధించగలను అనే పట్టుదల పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం బలపడుతుంది. దేవుడు నా ద్వారా తన పని జరిగించుకుంటాడు అనే స్ఫూర్తి అన్ని విషయాల్లో విజయాపథం వైపు నడిపిస్తాయి.
నూతన సంవత్సరం సమీపిస్తుండగా ఉన్నతమైన దేవుని చిత్తమును యెరిగిన వారమై ఓడిపోయిన సందర్భాలనుండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు కొనసాగుటకు ప్రయత్నిద్దాం. దేవుని ఆశార్వాదాలకు సమీపంగా చేరుదాం. ఆమేన్.
రోమా 8:18 మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.
Audio: https://youtu.be/xiYTxNoPwrk
For More Audio Formats Visit: https://www.youtube.com/playlist?list=PLeddg8-6BBJPNSEClIZRTsmImVGIOyHt-
Daily Devotions English Visit on Youtube: https://www.youtube.com/playlist?list=PLeddg8-6BBJOyBp15IGHF1dmfjn3MzZWt