యెహోవా నా కాపరి
మనందరికీ పరిచయం ఉన్న 23వ కీర్తనలో విశ్వాసికి కావలసిన, ఆయనను వెంబడించు వారి కొరకు దేవుడు చేసే అద్భుతమైన కార్యములు ఈ కీర్తనలో చూడగలము. యెహోవా నీకు కాపరిగా ఉండాలంటే ముందు నువ్వు గొఱ్ఱెవు అయుండాలి. ఏ జంతువు, పశువైనా ఎదురుతిరుగుతుంది కానీ గొఱ్ఱె ఎదురుతిరుగదు. గొఱ్ఱెలు కాపరి లేకపోతే బ్రతుకలేవు.
దేవుడు మనకు కాపరిగా ఉంటే, మనకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు చూద్దాము:
1. మన చుట్టూ సమస్యలు ఉండొచ్చు; కానీ, ఏ లేమి ఉండదు
2. సమృద్ధి గల చోట ఉంచబడుతాము కాబట్టి సమృద్ధి కలిగి సంతోషంగా ఉంటాము.
3. నీతి మార్గములో నడిపించబడుతాము అనగా, చెడు మార్గం, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు సరిచేయబడుతాయి
4. ఒక విశ్వాసి ప్రయాణం గాఢాంధకారం గుండా చెయ్యాలి అనగా, సమస్యలు శోధనలు శ్రమల గుండా వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని దుడ్డుకఱ్ఱ - శత్రువును ఎదురించుటకు సహాయపడుతుంది, దండము - పడిపోతే లేచుటకు సహాయపడతుంది
5. శత్రువులతో సమాధానము కలుగజేస్తాడు
6. నూనెతో తల అంటబడుతుంది.
గొఱ్ఱెల కాపరి ఎప్పుడు గొఱ్ఱెకు నూనెతో తల అంటుతాడు? గొఱ్ఱెల ముక్కు దగ్గర తడి ఉండుటవలన, పురుగులు గుడ్లు పెట్టి, అవి లావా అయ్యి తలలోకి వెళ్లుటవలన గొఱ్ఱెలు చనిపోతాయి. అందుకని గొఱ్ఱెల కాపరి ఒలీవల నూనెతో గొఱ్ఱె తల అంటుట వలన పురుగులు రావు. అలాగే మనం సమస్యలలో ఉన్నపుడు సాతాను నిరుత్సాహ తలంపులు పెట్టి మరణమునకు తీసుకొని వెళ్ళాలనుకుంటాడు. కానీ దేవుడిచ్చే అభిషేకం మనలను నూతనపరచుట ద్వారా బలపరచి, నడిపిస్తుంది కాబట్టి సాతాను క్రీయల నుండి కాపాడబడుతాము.
ఇన్ని మేలులు చేసే కాపరి చేత ఈరోజు నీవు నడిపించబడుతున్నవా?
Audio: https://youtu.be/b01lkmCkkjc