అనిశ్చిత మార్గాలు!
దక్షిణ భారత దేశంలో మనం అధిరోహించగల అత్యంత ఎత్తైన పర్వతం కేరళా ప్రాంతంలో ఉంది. ఆ పర్వతాన్ని అధిరోహించడానికి నేను ప్రయత్నించినప్పుడు ఎన్నో రకముల మార్గాలను దాటుకుంటూ వెళ్లాను. కొన్ని అందమైన పల్ల ప్రదేశాలు నడవగాలిగిన బాటలుగా ఉంటె మరి కొన్ని క్లిష్టమైన మార్గాలు. ముళ్ళపొదలు, దట్టమైన అడవి, జారిపడిపోయే బురద. వీటిని దాటుకొని ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు దూకడం కూడా తప్పదు. అనిశ్చితంగా ఉండే దారులు అభద్రతా మార్గాల్లో చివరకు సంతోషంగా నా గమ్యాన్ని నేను చేరుకోగలిగాను.
మన జీవితాల్లో కొన్ని మార్పులు ఇటువంటి అనుభవాలుగా ఉంటాయి. జీవితంలో ఒక స్థితి నుండి మరొక స్థితికి దూకడం తప్పనిసరి – కళాశాల నుండి జీవనోపాధికి, ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి, తల్లిదండ్రులతో కలిసి ఉండడం నుండి ఒంటరిగా లేదా జీవిత భాగస్వామితో జీవించడం, ఉద్యోగం నుండి పదవీవిరమణ. ఇలా యవ్వనం నుండి వృధాప్యం వరకు – అన్ని పరిస్థితులు అనిశ్చితంగా లేదా అభద్రతగా ఉంటాయి.
పాత నిబంధన కాలంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన మార్పు సోలోమోను తన తండ్రి నుండి దావీదు సింహాసనాన్ని తీసుకోవడం. భవిష్యత్తును గూర్చిన అనిశ్చితతో అతడు ఉన్నప్పుడు, అతని తండ్రి సలహా “నీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; (1 దిన 28:20) అని తెలియజేసాడు.
జీవితంలో కఠినమైన మార్పులలో ప్రయాణించినప్పుడు మనందరిలో అనేక అనుభవాలతో కూడిన భాగాన్ని పొందుతాము. అయితే మన ప్రయాణంలో దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళం కానే కాదు. సరైన దిశవైపు మనల్ని నడిపించే దేవుని మీద దృష్టి సారిస్తే సంతోషం, భద్రత దొరుకుతాయి. ఆనాడు దావీదును నడిపించిన దేవుడు నేడు మనలను కూడా నడిపిస్తాడు. సంతోషంతో అడుగులు ముందుకు వేద్దామా. ఆమెన్.
https://youtu.be/Crrawjuz1nw