దేవుణ్ణి ఆస్వాదించు
Audio: https://bit.ly/SVGooglePodcasts
ఒకానొకరోజు తెల్లవారుజామునే లేచి చెన్నై బీచ్ ప్రాంతంలో నడుస్తూ ఉన్నప్పుడు, బహుశా 5 గంటల ముప్పై నిమి. అనుకుంటా, అద్బుతమైన సూర్యోదయాన్ని చూడగలిగాను. కంటికి కనబడేంత దూరంలో సముద్రపు అంచులనుండి లేలేత కిరణాలతో మెరుస్తున్న సముద్రం, చీకటిని పారద్రోలే ఉదయభానుడి వెలుగు రేఖల్ని పట్టుకోవాలనే ఆలోచనలతో హృదయం ఉప్పొంగిపోయింది. ఎగసిపడుతున్న కెరటాల ధ్వనిలో ఆరోజు ఉదయం, నా హృదయం పులకొంచిపోయింది.
సూర్యోదయాస్తమాలు, తారల మధ్య చంద్రుడు - వీటిని ఎన్ని సార్లు చూసినా ఎవరైనా ప్రతిస్పందించాల్సిందే కదా. సృష్టిలోని అందాలను ఆశ్వాధించినప్పుడు కీర్తనల గ్రంధం మనకొక సంకేతాన్నిస్తుంది. తన సృష్టి కర్తను స్తుతించమని దేవుడు సూర్యచంద్ర నక్షత్రములను ఆదేశించినట్లు కీర్తనాకారుడు కీర్తన 148:3 లో వ్రాశాడు. భూమిని సూర్యకిరణాలు ఎంతవరకైతే తాకుతాయో, వాటితోపాటు మనము కూడా దేవుని స్తుతించేటట్లు కదిలింపబడుతాము.
ప్రకృతి ద్వారా బహిర్గతమయ్యే సౌందర్యాన్ని తిలకించినప్పుడు మనలను నిలిపివేసి మన దృష్టిని ఆకట్టుకోవడం మాత్రమె కాదు గాని, అందానికి తానె కర్త అయ్యున్నప్పుడు మన దృష్టిని మళ్ళించే శక్తి కూడా దానికి ఉంది. అనంతమైన దేవుని సృష్టి యొక్క అద్భుతం, మనం ఒక్క క్షణం ఆగి ఏది నిజంగా ప్రాముఖ్యమైనదో గూర్తు చేసికోనేలా చేయగలదు. అశీర్వాదాలు దయజేసే ప్రతి దినారంభం, దినాంతం వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని, దాన్ని విమోచించి, పునరుద్ధరించుకోటానికి దానిలో అడుగిడేటంతగా ఈ లోకాన్ని ప్రేమించాడని మనకు గుర్తు చేస్తుంది. ఆమెన్.
సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. కీర్తన 148:3