క్షమించాలనే మనసు
ఒకసారి నా స్నేహితుడు నాకు నమ్మకద్రోహం చేసినప్పుడు నాకు భరించలేనంత కోపం మరియు బాధ కలిగింది. వాస్తవంగా క్రైస్తవులమైన మనం అట్టి పరిస్తితులలో మన స్నేహితుల్ని క్షమించేవారంగా ఉండాలనే విషయం నాకు తెలుసు. అయినప్పటికీ నమ్మకద్రోహం మరి, గుండెను మెలిపెట్టే బాధ. సరే అని క్షమించేద్దాం అని అనిపించినా, మరలా ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి కొంచెం బాధగా అనిపించేది. అంటే నేనింకా కోపాన్ని ఉంచుకున్నానని నేను గమనించుకోగలిగాను. ఇటువంటి అనుభవం మనలో ఏంతో మంది అనుభావించుంటారు అని నా అభిప్రాయం. ఎలాగైతేనేం దేవుడు నా ప్రార్ధనలను ఆలకించి ఒకానొక రోజు పూర్తిగా నా మనసులోనుండి అట్టి ఆలోచనలను తీసివేసికోడానికి సహాయం చేశాడు. చివరికి నేను విడుదల పొందగలిగాను.
సిలువపై మరణిస్తున్న సమయంలో కూడా క్షమించే దేవుణ్ణి కలిగియున్న క్రైస్తవ విశ్వాసానికి మూలం “క్షమాపణ”. తనను సిలువేసిన వారిని క్షమించమని తండ్రిని వేడుకున్న యేసు- చేదును, కోపాన్ని మనసులో ఉంచుకోక తన యెడల తప్పుగా ప్రవర్తించిన వారి పట్ల కృపను ప్రేమను చూపించాడు.
మనలను బాధించే వారిని ప్రేమించే విషయంలో క్రీస్తు వలే మాదిరి కనుబరచడానికి, అనుసరించడానికి, మనం క్షమించవలసిన వారిని ఎవరినైనా క్షమించనాలోచించడానికి తరుణమిదే. తన ఆత్మా ద్వారా క్షమించడానికి సహాయం చేయుము - అని ప్రార్ధించినట్లయితే, ఏంతో కాలంగా క్షమించలేకపోయినా, అయన మనకు సహాయం చేస్తాడు. అలా చేసినప్పుడు క్షమాపణారహిత్యపు చెరనుండి విడుదల పొందుతాం. ఆమెన్.
యేసు - తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. లూకా 23:34
https://www.youtube.com/watch?v=a0lrU-rxGdw