క్రైస్తవుని జీవన శైలిలో - మనం తీసుకునే నిర్ణయాలు!
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. సామెతలు 3:6
మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఆ సమస్యను ఎదుర్కోడానికి ఎన్నో పరిష్కార మార్గాలుంటాయి. అయితే ఏ మార్గాన్నైతే మనం ఎంపిక చేసుకుంటామో దానిని బట్టే ఆ పరిష్కారానికి ఫలితాలు చూడగలం. సరైనటువంటి ఎంపిక సంతోషాన్ని కలుగజేస్తే, సరికాని నిర్ణయాలు బాధ లేదా కష్టానికి దారి తీస్తుంది. సమస్యను ఎదుర్కొనే సమయంలో మనం ఎంపిక చేసుకున్న పరిష్కారమార్గం సరైనదో లేదో అనేది ఆ నిర్ణయం తీసుకునే ముందు తెలియదు కదా. నిర్ణయించుకున్నప్పుడు అంతా సరిగ్గానే అనిపిస్తుంది కాని సమస్య మరలా ఎదురైనప్పుడే..ఆ రోజు ఆలా ఆలోచించకుండా ఉండవలసింది! ఆలా చేసి ఉండకపోతే బాగుండేది!...ఇటు వంటి ఆలోచనల్లో మనం అనేక సార్లు బాధకు గురవుతాము.
దేవుడు మనకు ఇచ్చిన వరం ఏ సమస్యనైనా ఎదుర్కోగలము అనే శక్తి. ఈ శక్తి క్రైస్తవుని జీవన శైలిలో అతి ప్రాముఖ్యమైనది. దేవుని విశ్వసించని వారు కూడా మంచి నిర్ణయాలు తీసుకొని వారి జీవితంలో సంతోషం పొందుతున్నారు కదా? అనే ప్రశ్న మీ దగ్గర ఉండవచ్చు. కానీ, కొన్ని విభిన్న పరిణామాల మధ్య సమస్యను ఎదుర్కోడానికి మనం ఎంపిక చేసుకునే నిర్ణయాలతో దేవుని ప్రణాళికలను జోడిస్తే. తద్వారా సమస్యను ఎదుర్కోవడమే కాదు గాని, ఆ ఫలితాలవెంబడి ఆశీర్వాదాలు చూడగలం. ఇది క్రైస్తవ విస్వాసంలో ప్రత్యేకమైనది. దేవుని విశ్వసించని వారు సమస్య ఎదురైనప్పుడు అటు ఇటు పరుగెత్తి ఎం చేయాలో అర్ధం కాక... ఉద్రిక్తతకు లోనై సహనాన్ని కోల్పోతారు. అయితే, విశ్వాసి మాత్రం ఎటు పరుగెత్తక మోకాళ్ల ప్రార్ధనలో తన ఆలోచనలపై దేవునికి అధికారమిచ్చి వాటిని ఎదుర్కొనే పరిష్కార మార్గాలను ఎంచుకుంటాడు. ఇదే క్రీస్తులో మన నిశ్చయత.
ఏదైన అనుకోని సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు, "ఆరోజు ఆలా చేయకుండా ఉండవలసింది.." అనుకుంటూ ఉండిపోక ఏమో చేయాలో అది చేయడానికి ప్రయత్నించడమే పశ్చాత్తాపానికొక నిదర్శనం. నేనంటాను, దేవుడు మన జీవితాల్లో సమస్యలను ఎందుకు అనుమతిస్తాడంటే, ఆ సమస్యను మనం అధిగమించినప్పుడు వాటి ద్వారా గొప్ప అనుభవాలను పొందాలనేదే దేవుని ఉద్దేశం. ఈ అనుభవాలే మనలను విస్వాసంలో పరిపూర్ణులుగా చేస్తుంది.
నా ఈ మాటలు వినడానికి వ్యత్యాసంగా అనిపించినా ఆచరణలో కష్టమేమి కాదు. అయితే, నిలకడ నిశ్చయత కేవలం మోకాళ్ళ జీవితంతోనే సాధ్యం, ఇది ప్రత్యేకమైన క్రైస్తవుని జీవన శైలి! ఆమేన్
https://youtu.be/qsYPaDRHRpU
The decision making in the lifestyle of a Christian (Decision making)
In all your ways acknowledge him, and he will make your paths straight. - Proverbs 3:6.
When we face any problem in our life, there are many ways to deal with that problem. But we can see the results of that solution depending on the paths we choose. If the right choice leads to happiness, wrong decisions can lead to suffering or hardship. We do not know whether the solution we have chosen is right or not unless we face that problem. Everything seems okay when decided, but when the problem comes up again, we end up thinking it would have been nice that we would have thought it differently.
The gift that God has given us is the power to face any problem. This power is of utmost importance in the lifestyle of a Christian. You may have a question – people who do not believe in God also make good choices and enjoy life? This is true, but the fact is dealing with the problem and the consequences that occur. When we combine God’s purpose and plan with the choices that we make, not only we overcome the problem when we face, but as a result we can see the blessings at the end. This is a specialty in the Christian faith. For those who do not believe in God; when they face any problem they do not understand what to do next, they run here and there, and lose patience. However, the believer chooses to pray and give authority to God over his thoughts and find solutions to deal with the problem. This is our certainty in Christ Jesus.
When something unforeseen happens in our life, trying to do what is supposed to be done instead we feel like “I shouldn't have done that” which is evidence of realization. I believe that God permits problems in our lives, to enable us and gain experience through them when we overcome that problem. These experiences make us perfect in faith.
My statements might be strange to hear, but these are not difficult to keep in practice. However, persistence is only possible when we kneel to God, which is a Unique Christian Lifestyle! Amen.
Audio : https://youtu.be/cAPPlwqF3bI