~ నీవు శ్రమల నడుమ ఉన్నప్పుడు..ఆ శ్రమ విచారము వలన కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మోసం కావచ్చు లేదా ఏదైనా కష్టం కావచ్చు..నీవు ఆ శ్రమవైపే చూచి సహజంగానే కలవరపడడం, భయపడడం చేస్తాము.
~ కానీ దేవుడు మనకు ఇంకొక మార్గమును కూడా చూపించారు: ఆయనయందు విశ్వాసముంచడం.
~ నీవు విశ్వాసముంచినప్పుడు నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిజమైన శాంతి కలుగుతుంది.
~ నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి శ్రమలను అనుభవించుచున్నావో ఆయనకు తెలుసు. ఆయన నిన్ను శాంతిమార్గములో నడిపించును.
~ అందుచేత నీ ప్రతీ శ్రమలో ఆయనయందు విశ్వాసముంచి మొఱ్ఱపెట్టుము.
ధ్యానించు:
యెషయా 26:3- “ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.”