Day 267 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వేళ్ళనియ్యలేదు (అపొ.కా. 16:6-8).

యేసు ఆత్మ ఇలా అడ్డు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. క్రీస్తు పని చెయ్యడానికే వీళ్ళు బితూనియకు వెళ్తున్నారు. అయితే క్రీస్తు ఆత్మే వాళ్ళను వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. కొన్ని సమయాల్లో నాకూ ఇది అనుభవమైంది. ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది. వెనక్కు తిరిగిపోయెలా బలవంతం చేసి ఎక్కడో ఎడారి భూముల్లోకి, ఒంటరితనంలోకి వెళ్ళగొట్టేది.

ఆత్మ సంబంధమైన సేవలో ఉత్సాహంగా చేసుకుపోతున్న పనిని విడిచి వెనక్కు తిరగవలసి రావడం చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైన పని చెయ్యడం ఒక్కటే కాదు, వేచి ఉండడం కూడా సేవించడమే అని గుర్తు చేసుకున్నాను దేవుని రాజ్యంలో ఒళ్ళు వంచి పనిచెయ్యడానికి సమయం ఉంది. పని చూసుకుని కనిపెట్టవలసిన సమయం కూడా ఉంది. కొంతకాలం ఏకాంతంలోకి వెళ్ళడం అనేది మానవ జీవితంలో అత్యంత ఉపయోగకరమైనదని అర్థం చేసుకోవాలి. నాకు ప్రియమైన ఎన్నో బితూనియలను నేను దర్శించకుండా వదలవలసి వచ్చినదాన్నిబట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నాను.

పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉందాం. ఏ విధంగానైనా ఉపయోగపడాలని తహతహలాడుతూ ఉండే నిరాశలు ఎదురవుతూ ఉండవచ్చు. ఈనాడు సేవ చెయ్యడానికి ద్వారం తెరవబడి ఉండవచ్చు. అయితే ప్రవేశించడానికి ముందడుగు వేస్తే అది మూసుకుపోవచ్చు.

చేతులు కట్టుకుని కూర్చోవలసిన సమయాల్లో మరొక ద్వారాన్ని కనుక్కోగలిగేందుకు దేవుడు సహాయపడతాడు. దేవుని సేవకి అవరోధం కలిగినపుల్లా ఆయనను మరో విధంగా సేవించడానికి అవకాశాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు నిశ్చలంగా , ఏ పనీ చెయ్యకుండా ఉండడంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళమౌతాం. దేవుని కొరకు కనిపెట్టడంలోనే ఆయన్ను సేవించడం ఇమిడి ఉంది. ఆత్మ నస్ను వెళ్ళవద్దని అడ్డగించినప్పుడు నేనేమీ అభ్యంతరాలు చెప్పను.

దేవుని సడిపింపు అర్ధం కానప్పుడు
ఏ పనీ లేకుండా కాలం గడిచినప్పుడు
నాకు ఉద్బోధించే మెల్లని స్వరాన్ని వింటాను
దేవుడు నమ్మదగినవాడు, కేవలం వేచి ఉంటాను