బైబిల్ క్విజ్ - 3


  • Author: Jyothi Swaraj
  • Category: Bible Quiz
  • Reference: Sajeeva Vahini Dec - Jan 2011 Vol 1 - Issue 2

  • 1. ఏ దినమున దేవుడు జంతువులను సృజించెను?
  • 2. ఎవరి మాట విని ఆదాము దేవుడు తినవద్దన్న పండు తినెను?
  • 3. అందరికంటె ఎక్కువ దినములు బ్రతికిన మనుష్యుడు ఎవరు?
  • 4. మొట్ట మొదటి శాపము దేవుడు ఎక్కడ, ఎవరిని శపించెను?
  • 5. ఎవని రక్తము యొక్క స్వరము నేలలో నుండి దేవునికి మొరపెట్టెను?
  • 6. హవ్వ అని పేరు పెట్టినది ఎవరు? హవ్వ అనగా అర్ధమేమి?
  • 7. కయీను శపింపబడిన తర్వాత ఎక్కడ నుండి ఎక్కడకు బయలుదేరెను?
  • 8. ఎనోషు అనగా అర్ధమేమి?
  • 9. ఆదాము నుండి నోవహుకు ఎన్ని తరములు?
  • 10. ఏడంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన యెడల మరి ఎవరి కోసం డెబ్బది ఏడంతలు వచ్చును?
  • సమాధానాలు: 1.6 2.హవ్వ 3.మెతుషెల 4.ఏదెను, హవ్వ, సర్పము 5.హేబెలు 6.ఆదాము, జీవము గల ప్రతివానికి తల్లి 7.యెహోవా సన్నిధి నుండి నోదు దేశమునకు 8.బలహీనుడు 9.లెమెకు 10.8