Final Interview, leak అయిన Question Paper, రెండే questions. ఎప్పటినుండో తెలిసిన answers.. ఇది situation. ఇలాంటి interview pass కాలేనివాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది కదూ, సరే face చేయగలవా అని నిన్నడిగితే నీ answer??
దేవుడు నిన్ను create చేసాడు అని నీకు తెలుసు, కాని ఎందుకు create చేసాడంటావ్? పరలోకం లో కొన్ని machines ఉండి bulk లో, wholesale గా మనుషుల్ని manufacture చేసి నిమిషానికి లక్ష మంది చొప్పున produce చేస్తున్నాయా ? కాదు కదా. అలా చేయాలంటే కూడా దేవునికి impossible ఏమి కాదు కాని అత్యంత ప్రేమామయుడైన దేవుడు తన చేతితో నిన్ను create చేసి నీకు life ఇచ్చాడు. [ఆది 2:7, యెషయా 44:2]
ఒక మనిషి ఒక వస్తువుని invent చేయలంటేనే ఏ purpose లేనిదే చేయడు. అలాంటిది అంత గొప్ప దేవుడు నిన్ను ఏ purpose లేకుండా create చేయడు. సరే, అయితే నిన్నెందుకు create చేసాడో నీకు తెలుసా [కొలస్సి 1:16]
దేవుడిని ఘనపరచడానికి, మహిమ పరచడానికి, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడానికి అనే routine answers వద్దు. ఈ reasons దేవుడు create చేసిన ప్రతీ దానికి ఉంది.అవును అది general purpose, ప్రకృతి, పూలు, పక్షులు, ఆకాశం, భూమి, మనిషి, అన్నీ ఆయన మహిమను చుపేవే. బట్టలెందుకు కొనుక్కుంటున్నావ్ అంటే వేసుకోడానికే, కాని school uniform ఎందుకు కొనుక్కుంటావ్ అంటే schoolకి వేసుకేళ్ళడానికి. దానికంటూ ఒక special purpose ఉంది. అలా దేవుడు నిన్ను కూడా తప్పకుండ ఒక special purpose తో చేసాడు.
అదేంటో ఎలా తెలుసుకోవాలి?
ముందెప్పుడూ లేని ఒక కొత్త వస్తువు create చేసి, నీ చేతికి ఇచ్చి, అది ఎందుకు create చేసాను అని అడిగితే guess మాత్రమే చేయగలవు కాని ఎందుకు అనేది sure గా చెప్పలేవు. ఆ వస్తువు కూడా దానంతటా అదీ చెప్పలేదు. ఏదైనా ఎందుకు create చేయబడింది అనేది దాన్ని create చేసినవాడు చెప్పాలి లేదా దాని కోసం వ్రాయబడ్డ user manual లో నైనా ఉండాలి. అలాగే నువ్వెందుకు create చేయబడ్డావ్ అనేది నిన్ను create చేసిన creator నే అడగాలి లేదా నీ user manual అనేది ఒకటుంది అందులో నుండి చదివి తెలుసుకోవాలి. ఆ user manual యే Bible. Bible అంటే ఏ వేదాంతమో రాద్దాంతమో అనీ నువ్వనుకుంటున్నావా? కాదు. అదొక్కటే “నువ్వెలా, నువ్వెందుకు, నువ్వేంటి” అనే, ఎక్కడ answers దొరకని questions కు answers చెబుతుంది.
అసలెందుకు తెలుసుకోవాలి?
Simple గా చెప్పాలంటే వెనకటికి ఒకడికి benz car కొనిస్తే దాని మీద బట్టలారేసుకున్నాడంటా. ఆ benz car పరిస్తితి నీకు రాకూడదు అని. Clear గా చెప్పాలంటే, నేను ఎక్కడికెళ్ళిన prayer చేసుకొనే వెళ్తాను, ఏమి చేసినా prayer చేసుకునే చేస్తాను. ప్రతీదానికి మర్చిపోకుండా thanks చెప్తాను, దేవుడు నన్ను దీవించాడు కాబట్టే ఇప్పుడు ఇంత గొప్ప position లో ఉన్నాను అని చెప్తే సరిపోదు. Life లో success అవ్వడానికి, life purposeful గా జీవిచడానికి చాలా తేడా ఉంది. నేను ఏం అవ్వాలి, నేను ఎక్కడుండాలి, నేను set చేసుకున్న goal ఏంటి ? ఇలా “నేను” తో start చేసి ఆలోచించుకుంటూ పొతే నీ life success వైపే ప్రయాణిస్తుంది. కాని “దేవుడు” తో start చేసి, దేవుడు నన్ను ఏమి చేయాలను కుంటున్నాడు, దేవుడు నన్నెక్కడుంచాలను కుంటున్నాడు, దేవుడు దేనికోసం నన్ను ఇక్కడ ఉంచాడు అని ఆలోచిస్తే అప్పుడు నీ purpose fulfill చేయగలుగుతావు. జీవితం అంటే నువ్వు కాదు, నీ గురించి కాదు, దేవుడు నిన్ను create చేసిన purpose కోసం జీవితం.
నీ life purpose తెలుసుకోవడం వల్ల నీ life కే ఒక meaning వస్తుంది. నీ destiny ఏంటి, నీ ప్రయాణం ఎటు అనే వాటిలో priorities మారతాయి. అసలు ఒక్కముక్కలో చెప్పాలంటే నీ lifestyle యే మారిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా eternity కి నిన్ను prepare చేస్తుంది. ఆ eternity లో enter అవ్వటానికే ఆ final interview. రేపో మాపో నువ్వు పొతే లేదా దేవుని రాకడ వస్తే దేవుని ముందు నిలబడి లెక్క అప్పజెప్పాలి [రోమా 14: 12]
ప్రేమామయుడైన దేవుడు తప్పకుండా పాస్ అవ్వాలని ముందే questions leak చేసాడు. Bible మొత్తాన్ని summarise చేస్తే దేవుడు రెండే రెండు questions అడుగుతాడని అర్ధమవుతుంది.
1. నా కుమారుడైన యేసు ప్రభువుని నీకోసం పంపాను, అతన్ని ఏం చేసావ్?
Jesus ని నీ personal saviour గా accept చేసి, ఆయనను నమ్మి ఆయన నేర్పిన త్రోవలో నడుచుకుంటూ ఆయన్ని ప్రేమించడం నేర్చుకున్నావా?
2. నీకు నేను life లో ఇచ్చిన అన్నిటిని నీకోసం నువ్వు వాడుకున్నావా లేదా నిన్ను నేనెందుకు create చేసానో ఆ purpose ని fulfill చేయడానికి వాడావా?
దేవుడు నీకిచ్చిన ప్రతీ gift, talent, money, positions and relationships అన్నిటికి దేనికి వాడావో లెక్క చెప్పాలి మరి. First question answer తో నువ్వు నీ eternity ని ఎక్కడ spend చేస్తావని decide చేస్తుంది, second question answer తో eternity లో నువ్వేం చేస్తావనేది decide చేస్తుంది.
ఈ రెండు questions కి ఏమి answers చెప్తే pass అవుతావో నీకు తెలుసు.
మరి నువ్వు ready నా ?