విగ్రహారాధన


  • Author: Sis. Vijaya Sammetla
  • Category: Articles
  • Reference: General

యేసు ప్రభువు వారు మనకు బదులుగా భారమైన సిలువను మోసారు. అవి కరుకైన నిలువు, అడ్డు దుంగలు మాత్రమే. ఇక ఆ సిలువ రూపమును(విగ్రహమును) మనము మెడలో వేసుకొని మోయాల్సిన అవసరం లేదు.

"దేనిరూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. నిర్గమ 20:4

ఆయన సిలువను మోస్తే? ఆ సిలువకు ఘనత వచ్చింది. మనము మోస్తూ ఆ సిలువకు అవమానం తెచ్చిపెడుతున్నాం.

ఒక్క విషయం ఆలోచించు!! సిలువను ధరించిన నీవు మాట్లాడేటప్పుడుగాని, దేవునికి వ్యతిరేఖమైన క్రియలు జరిగించేటప్పుడు గాని, అయ్యో! నేను సిలువను ధరించానే. ఇట్లా మాట్లాడకూడదు. ఇట్లాంటి పనులు చెయ్య కూడదు అనే తలంపు ఎప్పుడైనా వచ్చిందా? లేదు.

ఏదో భక్తి చేస్తున్నాం అనుకొంటున్నాము గాని, ఆ భక్తి దేవునికి అవమానం తెచ్చి పెట్టేదిగా వుంది?

చేతి మీద సిలువ రూపాన్ని పచ్చాబొట్టు వేయించుకొని అదే చేతితో సిగరెట్టు, మందు గ్లాసు పట్టుకుంటే? ఆ సిలువకు గౌరవమా? అవమానమా?

సిలువను ధరించి, సిలువకు అవమానం తెచ్చేకంటే? ధరించక పోవడమే శ్రేయష్కరం కదా? ఆలోచించు!!

యేసయ్య సిలువ త్యాగాన్ని అర్ధం చేసుకో! అనుసరించు! అది చాలు.

సిలువ ఒక విగ్రహంలా మారితే? నీవు విగ్రహారాధికుడులా మారిపోతావు.

విగ్రహారాధకులు" అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ప్రకటన 21:8

వద్దు! ఇది వినడానికే భయంకరం.

సరి చేసుకుందాం. సాగిపోదాం. గమ్యం చేరేవరకు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!