యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానల మధ్యనున్న మూడు రోజులలో ఎక్కడ గడిపాడు?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-Jesus-3-days.html

1 పేతురు 3:18-19 ఏలయనగా మనలను దేవునియొద్డకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్ర్మపడెను. దేవుని దీర్ఙ్హశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్డపరచుచుండగా, అవిధేయులైనవారియొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి. 18 వచనములోనున్న ఆత్మ విషయములో అన్న భాగము శరీర విషయములో లాగా నిర్మితమయినది. కాబట్టి ఆత్మ అన్న పదాన్ని శరీరమన్న పదముతో పోల్చుట సముచితమే. ఇక్కడున్న శరీరము ఆత్మ, క్రీస్తు శరీరము ఆత్మయే. ఆత్మ విషయములో బ్రదికింపబడి అన్నది క్రీస్తు పాపముల విషయములో శ్రమపడి మరణముద్వారా, తండ్రినుండి తన ఆత్మను వేరుపరచినాడు అని సూచిస్తుంది(మత్తయి 27:46). శరీరము ఆత్మల మధ్యనే వ్యత్యాసము మత్తయి 27:46 మరియరోమా 1:3-4 సూచించినట్లు క్రీస్తు శరీరము పరిశుధ్ధాత్మలమధ్య కాదు. క్రీస్తు పాపముల విషయమై ప్రాయశ్చిత్తము చెల్లించటం పరిపూర్ణమయినప్పుడు ఆయన ఆత్మ తెగిపోయిన సహవాసాన్ని పునరుద్డీకరించెను.

1 పేతురు 3:18-22 వచనాలలో క్రీస్తు శ్రమలకు (18) ఆయన మహిమపరచబడుటకు (22) మధ్యనున్న సంభంధాన్ని సూచిస్టుంది. కేవలం పేతురు మాత్రమే ఈ రెండు సంఘటనల మధ్యన జరిగిన సమాచారాన్ని అందిస్తున్నాడు. 19వ వచనములో భోధించటం అన్న పదం నూతన నిభంధనలో తరచుగా వాడే సువార్త భోధించటం అన్నవంటిది కాదు. ఒక వార్తను చాటించటం అని అర్థం. యేసు శ్రమనొంది సిలువపై మరణించాడు. ఆయన శరీరము మరణమునకు అప్పగించబడింది. ఆయన మీద పాపము మోపగా ఆయన ఆత్మ మరణించెను. అయితే ఆయన ఆత్మను బ్రదికించబడినపుడు ఆయన దానిని తండ్రికి అప్పగించెను. పేతురురాసినట్లుగా మరణానికి పునరుత్థానికి మధ్యన చెరలోనున్న ఆత్మలకు ప్రత్యేకంగా ప్రకటన చేసెను.

పేతురు మనుష్యులకు సూచించటానికి ప్రాణాత్మలు (సోల్స్)వుపయోగించాడు కాని ఆత్మలుగా (స్పిరిట్స్)కాదు. క్రొత్త నిబంధనలో ఆత్మ అన్నదానిని దేవదూతలకు, దయ్యములకు వుపయోగించారు కాని మనుష్యులకు కాదు. ఇదే భావాన్ని 22వ వచనములో కూడ చూడవచ్చు. మరియు బైబిలులోమరీ ఇంకెక్కడ కూడ యేసుక్రీస్తు నరకాన్ని దర్శించినట్లు పేర్కొనబడలేదు. అపోస్తలుల కార్యములు 2:31లో పేర్కొనబడిన పాతాళము కాదు. పాతాళముఅన్నది మరణించిన వారి స్థాయిని సూచించేది. పునరుత్థానముకోసం వేచియుండే తాత్కాలికమైన ప్రదేశము. ఈ రెండింటి మద్యననున్న వ్యత్యాసాన్ని ప్రకటన 20:11-15 ను చూడగలం. నరకం నిత్యమైనది, అంతిమ స్థానం నశించినవారికి ఇచ్చినటువంటి తీర్పు. పాతాళము (హెడెస్) తాత్కాలికమైనది.

మన ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించిన తర్వాత మరణించాడు. మరణ పునరుత్థానముల మధ్య పాతాళములోనున్న ఆత్మలకు (బహుశా త్రోసివేయబడినటువంటి దేవదూతలు యూదా6)లో భోధించెను. నోవహు ప్రళయమునకు ముందు కాలమునకు చెంధినవారికి వర్తమానము అందించెను. 20వచనము దీనిని స్పష్టము చేస్తుంది. చెరలోనున్న ఆత్మలకు ఏమి ప్రకటించారో పేతురు చెప్పలేదు గాని, బహుశా! వర్తమానము విమోచనమునకు సంభంధించినది కాకపోవచ్చు. ఎందుకంటే రక్షణ దేవదూతలకు వర్తించదు కాబట్టి (హెబ్రీయులకు 2:16). ఇది బహుశా! సాతాను మరియు అతని శక్తులపై ప్రకటించిన విజయము (1 పేతురు 3:22; కొలస్సీయులకు 2:15). ఎఫెసీయులకు 4:8-10 క్రీస్తు పరదైసుకు వెళ్ళినట్లు సూచిస్తుంది. (లూకా 16:20;23:43) మరియు ఆయన మరణమునకు ఆయనయందు విశ్వాసముంచిన వారందర్ని పరలోకమునకు తీసుకొనివెళ్ళెను. ఈ వాక్యభాగమునకు ఎక్కువ వివరములను ఇవ్వటంలేదు అని చెరను చెరగా కొనిపోబడెను అన్న దానికి ఎక్కువమణ్ది బైబిలు పండితులు అంగీకరించేది ఈ భాష్యంనే.

కాబట్టి యేసుక్రీస్తు మరణమునున్న మధ్య మూడురోజులలో ఖచ్చితంగా ఏంచేశారో అన్నది బైబిలు స్పష్టీకరించటం లేదు. ఆయన త్రోసివేయబడిన దేవదూతలు అవిశ్వాసులపై విజయాన్ని ప్రకటించటానికి వెళ్ళినట్లు సూచిస్తున్నాయి. యేసయ్య రక్షణ నిమిత్తము ప్రజలకు రెండవ అవకాశము ఇవ్వటానికి అన్న విషయము మాత్రము ఖచ్చితముగా అర్థంచేసుకోగలం. మరణం తార్వాత మనము తీర్పును ఎదుర్కోవాలి రెండవ అవకాశం లేదని ఖచ్చితముగా (హెబ్రి 9:27) చెప్తుంది. యేసుక్రీస్తు తన మరణము పునరుత్థానముల మధ్య ఏంచేశారో అని నిర్థిష్టమైన జవాబు లేదు. బహుశా మనము మహిమలో చేర్చబడిన తర్వాత అర్థంచేసుకోగలిగే ఒకే మర్మం ఇదేనేమో!