మంచివారికి చెడు విషయాలు జరగటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-bad-things.html

క్రైస్తవ ధర్మశాస్త్రపరంగా వున్న క్లిష్టమైన ప్రశ్నలలో ఇది ఒకటి. దేవుడు నిత్యుడు, అనంతుడు, సర్వవ్యామి, సర్వ ఙ్ఞాని మరియు సర్వశక్తుడు. దేవుని మార్గములను పూర్తిమంతముగా అర్థం చేసుకోవాలని మానవుడు (అనినిత్యుడు, అనంతముకాని, అసర్వవ్యామి, అసర్వఙ్ఞాని మరియు అసర్వశక్తుడు)నుండి ఎందుకు ఆశిస్తారు? యోబు గ్రంధం ఈ విషయాన్ని గురుంచి వివరిస్తుంది. యోబును చంపుటకు కాక మిగిలిన విషయాలన్నిలో సాతాను అతనిని పరీక్షించుటకు దేవుడు అనుమతినిచ్చాడు. అయితే యోబు ఏవిధంగా స్పందించాడు? ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను (యోబు 13:15). యెహోవా యిచ్చెను యెహోవా తీసికొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక (యోబు 1:21). అనుభవించినవాటినన్నిటిని దేవుడు ఎందుకు అనుమతించాడు అనేది యోబుకు అర్థం కాలేదుగాని, అయినప్పటికి దేవుడు మంచివాడని ఎరిగి ఆయనయందు విశ్వాసముంచుతూ ముందుకు సాగిపోయెను.

మంచివారికి చెడు ఎందుకు జరుగుతుంది? మంచివారు ఎవరూ లేరు అనేది బైబిలు పరమైన జవాబు. మనమందరము పాపము చేత కళంకమై పీడించబడుతున్నామని బైబిలు చాల తేటతెల్లముగా ధృఉవీకరిస్తుంది(ప్రసంగీ7:20; రోమా 6:23; 1 యోహాను 1:8). రోమా 3:10-18 వచనముల ప్రకారము మంచివారు లేరు అనేదానిని స్పష్టీకరించలేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు. దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవతప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద విషసర్పమున్నది. వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పెదవులు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతిమార్గములు వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు. ఈ క్షణమందే ఈ విశ్వముపైనున్న ప్రతి మానవుడు నరకములో పడద్రోయబడుటకు అర్హులు. మానవుడు జీవించే ప్రతీక్షణము కేవలము ఆయన దయ మరియు కృప వల్లనే జీవించుచున్నారు. మనము అనుభవించుటకు అర్హులమైన అగ్నిగుండము, నిత్యమైన నరకముతో పోల్చిచూచినట్లయితే ఈ భూమిమీద మనము ఏదైతే భయంకరమైన, ధు:ఖపూరితమైన పరిస్థితిని అనుభవించుచున్నామో మనము అనుభవించుటకు అర్హులమైనప్పటికి అది చాలా దయనీయమేనని అని అనిపిస్తుంది.

ఒక శ్రేష్టమైన ప్రశ్న ఏంటంటే చెడ్డవారికి మంచిపనులు జరగటానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? రోమా 5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. ఈ లోకంలోనున్న ప్రజలు దుష్ట, చెడు, పాపపు స్వభావమునకు చెందినవారైనాప్పటికి దేవుడు ఇంకను ప్రేమించుచునే ఉన్నాడు.మనము అనుభవించాల్సిన పాపపుజీతాన్ని కొట్టివేయుటకు ఆయన మనకొరకు మరణించాడు (రోమా 6:23). యేసుక్రీస్తు రక్షకునిగా మనము అంగీకరించినట్లయితే (యోహాను 3:16; రోమా 10:9), నీ పాపములు క్షమించబడి నీకు వాగ్ధానము చేయబడిన పరలోకమనే నిత్యమైన గృహములోనికి ప్రవేశింతువు (రోమా8:1). మనకు నరకము యోగ్యమైనవారము. యేసుక్రీస్తునొద్డకు విశ్వాసముతో వచ్చినట్లయితే మనకు ఇవ్వబడింది నిత్యజీవము అనే పరలోకము.

అవును. అయోగ్యముగా ఎంచబడే ప్రజలకు కొన్నిసార్లు చెడ్డపనులు జరుగును. మనము అర్థం చేసుకున్నా లెక చేసుకోపోయిన దేవుడు మట్టుకు తన ఉద్దేశ్యపూర్వకముగా విషయాలను అనుమతిస్తాడు. అన్నిటికంటె మించి, ఏదిఏమైనప్పటికి దేవుడు మంచివాడు, న్యాయవంతుడు, ప్రేమగలిగినవాడు మరియు దయగలవాడు. తరచుగా మనకు జరిగే విషయాలను అర్థం చేసుకోలేము. అయినప్పటికి, దేవుని యొక్క మంచితనమును అనుమానించుటకంటే ఆయనయందు విశ్వాసముంచుతూ ప్రతిస్పందించవలెను.నీ స్వబుద్ధిని ఆధారముచేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును (సామెతలు 3:5-6).