దేవుని ప్రణాళిక | Plans for your Life


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

దేవుని ప్రణాళిక 

నీ జీవితం కొరకైన దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక ఒక నిర్దిష్టమైన నిరీక్షణ కలిగి ఒక బలమైన చిత్తాన్ని కలిగియుంది. అవును, యిర్మీయా 29:11 ఇలా చెబుతోంది, " నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు."

జీవితం అనిశ్చితంగా లేదా నిరాశపరిచినప్పుడు, దేవుని ప్రణాళికలు ఎల్లప్పుడూ మంచివని ఈ వాక్యం మనకు భరోసా ఇస్తుంది. పరిస్థితులు అర్ధవంతం కానప్పుడు కూడా, ఆశతో నిండిన భవిష్యత్తును తీసుకురావడానికి ఆయన తెరవెనుక పనిచేస్తున్నాడు. ఆయన సమయం ఉద్దేశ్యం పరిపూర్ణమైనవి, చివరిగా మీకు మంచి జరగడానికే  రూపొందించబడ్డాయి.

ఈరోజు, మీ జీవితానికి సంబంధించిన దేవుని ప్రణాళిక మీరు చూడగలిగే దానికంటే చాలా ఎక్కువగా ఉందని నమ్మండి. మీ భయాలు మరియు సందేహాలను ఆయనకు అప్పగించండి. ఆయన తన ఆశీర్వాదాలు మరియు ప్రేమతో నిండిన భవిష్యత్తు వైపు మిమ్మల్ని నడిపిస్తున్నాడని తెలుసుకుని నమ్మకంగా నడవండి. ఆమెన్.

Quote: మీరు కనే కలల కంటే మీ యెడల దేవుని ప్రణాళికలు ఉన్నతమైనవి. 

https://youtube.com/shorts/F7kjxI0JQX0

Plans for your Life

Does God really have a plan for my life? Yes, and it’s filled with hope and purpose.
Yes, Jeremiah 29:11 says, "For I know the plans I have for you," declares the Lord, "plans to prosper you and not to harm you, plans to give you hope and a future."
In moments when life feels uncertain or disappointing, this verse reassures us that God’s plans are always good. Even when circumstances don’t make sense, He is working behind the scenes to bring about a future filled with hope. His timing and purpose are perfect, designed for your ultimate good.
Today, trust that God’s blueprint for your life is far beyond what you can see. Surrender your fears and doubts to Him, and walk confidently, knowing that He is leading you toward a future that is full of His blessings and love.

Quote: "God’s plans for you are greater than your greatest dreams."