స్థిరమైన ఆనందం
యోహాను 16:22 - అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.
దుఃఖం
మరియు బాధ మన మానవ అనుభవంలో భాగమని
యేసు క్రీస్తు వివరిస్తూ, ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా మన నుండి వేరుచేయని గొప్ప సంతోషాన్ని పొందుకోగలమని వివరించాడు. ఇది పరిస్థితుల ఆధారంగా క్షణికమైన ఆనందం కాదు, కానీ ఆయన సన్నిధిలో మనం పొందుకునే ఆనందం, అది మన పాపం
మరియు మరణంపై ఆయన మనకు అనుగ్రహించిన విజయంలో పాతుకుపోయిన లోతైన, స్థిరమైన ఆనందం.
జీవితం భారంగా అనిపించినప్పుడు, ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి - మీ దుఃఖం తాత్కాలికం, కానీ
యేసు క్రీస్తు అందించే ఆనందం శాశ్వతమైనది. ఇది ఎవరూ తీసివేయలేని ఆనందం, పరీక్షలు లేదా విజయాల మధ్య స్థిరంగా నిలబెట్టే ఆనందం.
ఈరోజు ధైర్యం తెచ్చుకోండి! దుఃఖ సమయాల్లో కూడా,
యేసు క్రీస్తు మీ అంగలార్పును నాట్యముగా మార్చగల సమర్ధుడనే వాగ్దానంపై విశ్వసించండి. ఈ మాటలు అంతులేని ఆనందం కోసం మీ హృదయాలను నిరీక్షణతో నింపనివ్వండి. ఆమెన్.
Quote: నిజమైన ఆనందం ఈరోజు మనం ఎదుర్కొనే పరిస్థితులనుండి కాదు గాని, రే
పేమి సంభవించినా అధైర్యపడని స్థిరమైన నిరీక్షణ ద్వారా కలుగుతుంది.
"So with you: Now is your time of grief, but I will see you again, and you will rejoice, and no one will take away your joy." – John 16:22
Unshakable Joy
John 16:22 “Now is your time of grief, but I will see you again, and you will rejoice, and no one will take away your joy." Jesus acknowledges that grief and pain are part of our human experience, but He also points to a greater reality—His promise of joy that cannot be stolen. This is not fleeting happiness based on circumstances but a deep, unshakable joy rooted in His presence and His victory over sin and death.
When life feels heavy, remember this promise: your grief is temporary, but the joy Jesus offers is eternal. It’s a joy no one can take away, a joy that stands firm in the face of trials and triumphs alike.
Take heart! Even in seasons of sorrow, hold onto the promise that Jesus will turn your mourning into joy. Let His words fill you with hope and anticipation of the unending joy He gives.
Quote: "The deepest joy comes not from what we see now but from the unshakable hope of what is to come."