విడదీయలేని దేవుని ప్రేమ | Nothing can separate us


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవు రోమా 8: 38-39

విడదీయలేని దేవుని ప్రేమ

రోమా 8:38-39 ప్రకారం “దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవు”. అవును, ఈ మాట ఒక అచంచలమైన సత్యాన్ని ప్రకటిస్తుంది: ఏదీ కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. మన గతంలో చేసిన పొరపాట్లు, ప్రస్తుత పోరాటాలు లేదా భవిష్యత్తు లో పొందే శ్రమల కంటే ఆయన ప్రేమ స్థిరంగా ఉండి ఎన్నడు మారనిదిగా ఉంటుంది. ఆయన ప్రేమ నుండి దూరం చేసే ప్రతి శక్తిపై, విజయం సాధించేలా చేస్తుంది.
జీవితం సంకోచితంగా అనిపించినప్పుడు, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఎటువంటి శ్రమ, భయం లేదా వైఫల్యం ఎదురైనా, దాని బంధాన్ని విచ్ఛిన్నం చేయలేని శక్తివంతమైన ప్రేమ మిమ్మల్ని నిలబెడుతుంది. మీ పట్ల దేవుని ప్రేమ అపారమైనది; అది శాశ్వతమైనది మరియు విడదీయరానిది.

ఈరోజు, దేవుని ప్రేమలో ఎప్పటికీ ప్రేమించబడుతున్నారనే నమ్మకంతో నడవండి. ఆయన ప్రేమ మీకు బలాన్ని, నెమ్మదిని మరియు మీ దారిలో అడ్డుపడే దేనినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆమెన్. 

Quote: పర్వతం ఎంత ఎత్తులో ఉన్నా, లోయ ఎంత లోతుగా ఉన్నా, దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మిమ్మల్ని చేరుకుంటుంది.

https://youtube.com/shorts/7RxDwr0UB8s

"Nothing can separate us from the love of God." - Romans 8:38-39

Nothing can separate us

Romans 8:38-39 declares an unshakable truth: nothing—absolutely nothing—can separate us from God’s love. Not your past mistakes, present struggles, or future uncertainties. His love is constant, unchanging, and victorious over every force that tries to pull us away.
When life feels overwhelming, hold on to this promise. You are held by a love so powerful that no obstacle, fear, or failure can break its bond. God’s love for you isn’t fragile; it’s eternal and unbreakable.
Walk in the confidence that you are forever loved. Let His love give you strength, hope, and the courage to face whatever comes your way.

Quote: "No matter how high the mountain or how deep the valley, God-s love will always reach you."