శక్తిగల దేవుని ప్రేమ | Power of God’s Love


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి..సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. -ఎఫెసీయులకు 3: 20-21

శక్తిగల దేవుని ప్రేమ

దేవుని ప్రేమ మానవ ఊహల ద్వారా పరిమితం కాదు - అది అనంతమైనది, అపరిమితమైనది, అవధులులేనిది. ఎఫెసీ 3:20-21 “మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి..సదాకాలము మహిమ కలుగునుగాక “, ఈ వాక్యం దేవుని ప్రేమలో లోతైన సత్యాన్ని ప్రతిబింబించమని మనల్ని ఆహ్వానిస్తుంది. దేవుడు మనల్ని అపారంగా ప్రేమించడమే కాకుండా, మనం అడగగలిగే లేదా ఊహించగలిగే దానికంటే చాలా ఎక్కువ సాధించడానికి ఆయన మనలో శక్తివంతంగా పనిచేస్తాడు.

విశ్వాన్ని సృష్టించిన అదే దేవుడు మీలో పనిచేస్తున్నందున మీరు మీ స్వంత బలం లేదా స్వశక్తి ద్వారా పరిమితం చేయబడలేదు. మీరు ఆయన ప్రేమ మరియు శక్తిని స్వీకరించినప్పుడు, ఆయన మీ జీవితంలో సాధించగల దానికి పరిమితి లేదని గ్రహించాలి.

ఈరోజు ధైర్యంగా ఉండండి - దేవుని ప్రేమ మిమ్మల్ని హత్తుకొని, ఆయన శక్తి మిమ్మల్ని బలపరుస్తుంది, మీ కోసం ఆయన ప్రణాళికలు మీ ఊహలకంటే మించినవి. ఆయనను నమ్మండి మీ జీవితం కోసం ఆయన కలిగి ఉన్న అపరిమిత అవకాశాలలోకి ధైర్యంగా అడుగు పెట్టండి. ఆమెన్.

Quote: దేవుని ప్రేమ అవధులులేనిది, ఆయన శక్తి అపరిమితమైనది..ఆయన ద్వారా అసాధ్యమేదైనా సుసాధ్యమవుతుంది.

https://youtube.com/shorts/wLqnjO4qkh0

“Now to him who is able to do immeasurably more than all we ask or imagine, according to his power that is at work within us.. to him be glory.. for ever and ever! Amen” Ephesians 3:20-21

Power of God’s Love

God’s love isn’t limited by human understanding—it’s infinite, boundless, and all-encompassing. Ephesians 3:20-21 invites us to reflect on this profound truth: not only does God love us deeply, but He also works powerfully within us to achieve far more than we could ever ask or imagine.
You are not limited by your own strength or vision because the same God who created the universe is working within you. When you embrace His love and power, there is no limit to what He can accomplish in your life.
Today, May God’s love surrounds you, His power strengthens you, and His plans for you exceed your wildest imagination. Trust Him, and step boldly into the immeasurable possibilities He has for your life. Amen.

Quote: God’s love is limitless, His power is boundless, and through Him, the impossible becomes possible.


https://youtube.com/shorts/sPPyhDyoKOs

https://youtube.com/shorts/Vkx0o4WVt3M