ఒక ఉపన్యాస వివరణ భాగంగా, నేను వేదిక మీద ఒక కళాకారుడు రూపొందిస్తున్న అందమైన చిత్రం వైపు నడిచాను, నా వలన దాని మధ్యలో నల్లని గీత ఏర్పడింది. అక్కడ ఉన్న వాళ్లంతా ఉక్కిరిబిక్కిరి
అయ్యారు. నేను చెడగొట్టిన దానిని ఆ కళాకారిణి మాత్రం నిలబడి చూసింది. ఆ తరువాత, ఒక క్రొత్త బ్రష్‌ను ఎంచుకుని, ఆమె ప్రేమతో శిథిలమైన పెయింటింగ్‌ను ఒక అద్భుతమైన కళాకృతిగా మార్చింది.
ఆమె పునరుద్ధరణ పని మన గందరగోళ జీవితాలలో
దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకానికి తెచ్చింది. ప్రవక్త అయిన
యెషయా ఇశ్రాయేలు మనుష్యులను వారి ఆత్మీయ అంధత్వంను చెవిటితనంను మందలించాడు (
యెషయా 42:18-19), అయితే దేవుని విమోచన, విడుదల నిరీక్షణను అతడు ప్రకటించాడు: “భయపడకుము, నేను నిన్ను విమోచించి యున్నాను” (43:1). ఆయన మనకు కూడా అలాగే చేయగలడు. మనం పాపము చేసినప్పటికీ, మన పాపాలను ఒప్పుకొని, దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయన మనలను క్షమించి, పునరుద్ధరిస్తాడు (వ. 5-7; 1
యోహాను 1:9 చూడండి). మనం గందరగోళము నుండి సౌందర్యాన్ని తీసుకురాలేము, అయితే అది ఆయన చేయగలడు. సువార్తకు చెందిన శుభవార్త ఏమిటంటే, ఆయన తన రక్తం చేత మనలను విమోచించాడు. చివరికి,
క్రీస్తు మన కన్నీటిని తుడచి, మన పాత జీవితం నుండి విమోచించి, సమస్తాన్ని నూతన పరుస్తాడని ప్రకటన గ్రంథం మనకు రూఢీపరుస్తుంది. (ప్రకటన 21:4-5).
మన జీవిత కథకు చెందిన దర్శనం అల్పమైంది. మన కథపై మనకు పరిమిత దృష్టి ఉంది. అయితే మన “
పేరు” ఎరిగిన
దేవుడు (
యెషయా 43:1) మన జీవితాలను మనం ఊహించలేనంత అందంగా మారుస్తాడు. మీరు
యేసుపై విశ్వాసంతో విమోచన పొందినట్లైతే, మీ కథ ఒక, పెయింటింగ్ వంటిది, అద్భుతమైన ముగింపును కలిగి ఉంటుంది.
- గ్లెన్ పాక్యం
నీవు ఎలా గందరగోళానికి ఎలా గురయ్యావు? నీ పునరుద్ధరణ,
విముక్తి కోసం దేవుడు ఏమి సమకూర్చాడు? ప్రియమైన యేసూ, నన్ను ఎన్నటికీ విడిచిపెట్టనందుకు వందనాలు.
నన్ను మీకు సమర్పించుకుంటున్నాను, నేను చెడగొట్టుకున్నది తిరిగి విమోచించమని అడుగుచున్నాను.
దేవుడు తన దూత నంపించి, సింహములు నాకు ఏ హానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. [
దానియేలు 6:22 ]