అసలైన యేసు


  • Author: Our Daily Bread
  • Category: Our Daily Bread
  • Reference: Sajeeva Vahini

పుస్తకాల క్లబ్ లీడర్ అక్కడ ఉన్న గుంపు చర్చించబోయే నవలను క్లుప్తంగా వివరించడంతో గదిలో సందడి హాయిగా నిశ్శబ్దంగా మారింది. నా స్నేహితుడు జోన్ శ్రద్ధగా విన్నాడు. అయితే
కథ యొక్క పన్నాగాన్ని గుర్తించలేదు. చివరికి, ఇతరులు చదివిన కల్పనకు సమానమైన శీర్షికతో తాను ఇతిహాస పుస్తకాన్ని చదివినట్లు ఆమె గ్రహించింది. ఆమె “మరొక” పుస్తకాన్ని చదివి ఆనందించినప్పటికీ, ఆమె తన స్నేహితులు చర్చించుకుంటున్న ఆ పుస్తకంతో ఏకీభవించలేకపోయింది.

అపొస్తలుడైన పౌలు యేసును విశ్వసించే కొరింథీ సంఘ విశ్వాసులు “మరియొక” యేసును విశ్వసించాలని కోరుకోలేదు. అబద్ధ బోధకులు సంఘం లోనికి చొరబడి వారికి భిన్నమైన “యేసు”ని అందించారని వారు అబద్దాలతో మోసపరుచుకుంటున్నారని సూచించాడు (2 కొరింథీ. 11:3-4). 

ఈ కపటమైన మోసపూరిత బోధకుల అబద్ధాలను పౌలు ఖండించాడు. కొరింథీ సంఘానికి తన మొదటి పత్రికలో, అతడు లేఖనాలలోని యేసును గురించిన సత్యాన్ని వివరించాడు. ఈ యేసు మెస్సీయ, “మన పాపముల నిమిత్తము మృతిపొందెను ... మూడవ దినమున లేపబడెను ...తరువాత పండ్రెండుగురికిని కనబడెను ...కడపట పౌలుకును కనబడెను (1 కొరింథీ. 15:3-8). ఈ యేసు కన్య మరియ ద్వారా భూమి మీదకు వచ్చాడు, ఆయన దైవిక స్వభావాన్ని ధృవీకరించడానికి ఇమ్మానుయేలు (దేవుడు మనకు తోడని) అని పేరు కలిగి ఉన్నాడు. (మత్తయి 1:20-23).

ఇది మీకు తెలిసిన యేసులా అనిపిస్తుందా? ఆయన గురించి బైబిల్లో రాసిన సత్యాన్ని అర్థం చేసుకోవడం, అంగీకరించడం మనం పరలోకానికి నడిపించే ఆత్మీయ మార్గంలో ఉన్నామన్న నిశ్చయత ఇస్తుంది.

- జెన్నిఫర్ బెన్సన్ షుల్ట్

నీవు యేసు గురించిన సత్యాన్ని నమ్ముచున్నావని నీకు ఎలా తెలుసు? 
బైబిలు ఆయన గురించి ఏమి చెపుతుందో నీవు అర్థం చేసుకున్నావని నిర్ధారించుకోవడానికి 
నీవు ఏమి పరిశోధించవలసి ఉంటుంది?
ప్రియమైన దేవా, నీ సత్యమార్గంలో నడుచుటకు నాకు సహాయం చేయండి.


నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము. [ యెషయా 43:1 ]