నేను ఇటీవల ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశాను. ఓ మురికి మార్గమును వెంబడిస్తూ నా ఇంటికి సమీపంలోని చెట్ల సమూహంలోనికి ప్రవేశించాను. ఒకరు సిద్ధపరచుకొన్న ఆటస్థలమును కనుగొన్నాను. ఎత్తులో చూచుటకు చెక్కతో చేసిన ఒక నిచ్చెన, పాత కేబుల్ తీగలుతో కొమ్మల నుండి వేలాడుతున్న ఊయల, కొమ్మల మధ్య వ్రేలాడే వంతెన ఉన్నాయి. వేలాడుతున్న ఒక వంతెన కూడా ఉంది. ఒకరు పాత చెక్కలు, తీగలుతో సృజనాత్మక సాహసకృత్యమును ఏర్పాటు చేశారు!
స్విస్ వైద్యుడైన పాల్ టూర్నియర్, మన కోసం
దేవుడు సాహస కార్యాలు చేశాడని నమ్మాడు.
ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో తయ్యారయ్యాం. (ఆదికాండము 1:26-27).
దేవుడు ఒక విశ్వాన్ని ఏర్పాటు చేయుటకు పూనుకున్నట్లు (వ. 1-25), మంచి చెడులను ఎంచుకోగల మానవులను
దేవుడు సృష్టించి సాహసం చేసినట్లు (3:5-6), మనలను “ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుటకు పిలిచినట్లు” (1:28), ఫలభరితంగా ఈ భూమిలో ఏలుబడి చేస్తూ నూతన విషయాలు కనుగొనుటకు, ఆవిష్కరించుటకు, సాహస కార్యాలు చేయుటకు మనము నడిపింపు కలిగి ఉన్నాము. ఆ సాహస కార్యాలు పెద్దవైనా చిన్నవైనా, ఇతరుల శ్రేయస్సు కోసం అయిన యెడల అవి ఉత్తమంగా ఉంటాయి. ఆ ఆట స్థలాన్ని కనుగొన్న వారు దానిని ఆనందిస్తూ ఖచ్చితంగా తయారు చేసిన వారిని ప్రశంసించక మానరు.
నూతన సంగీతాన్ని కనిపెట్టినా, సువార్తను అందించే నూతన పద్దతిని కనిపెట్టడం అయిన,తెగిపొయిన వివాహ బంధాన్ని పునరుజ్జీవం చేయడం అయిన సరే, అలాంటి
అన్ని రకాల సాహసాలు మన హృదయాన్ని కదిలిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మీరు క్రొత్తగా చేయాలని అనుకుంటున్న కార్యాలు ఏమిటి? బహుశా
దేవుడు మిమ్ములను నూతన కార్యాలకై సాహసించుటకు నడిపిస్తున్నాడేమో?
- షెరిడన్ వాయ్సే
మరి దేవుడిని, వాక్యంలో ధైర్యసాహసాలుగలవానిగా ఎలా చూస్తారు?
ఆయన సాహసాలు మనకు ఎలా స్ఫూర్తినిస్తాయి?
సాహసోపేతమైన దేవా, నీ పట్ల ఇతరుల పట్ల ప్రేమతో నన్ను క్రొత్త సాహస యాత్రకు పంపండి!
“ప్రభువా, నీవెవడవని?”
సౌలు అడుగగా... [ అపొ. కార్యములు 9:5 ]