నివసించుటకు ఒక గూడు


  • Author: Our Daily Bread
  • Category: Our Daily Bread
  • Reference: Sajeeva Vahini

సాండ్ మార్టిన్స్  పిచ్చుక జాతికి సంబంధించిన చిన్న పక్షులు  అవి తమ గూళ్ళను నది ఒడ్డున తవ్వుతాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లో వాటి నివాసస్థలాలు తగ్గిపోయాయి, పక్షులు ప్రతి సంవత్సరం తమ శీతాకాలపు వలస నుండి తిరిగి వచ్చినప్పుడు గూడు కట్టుకోవడానికి తక్కువ స్థలాలను కలిగి ఉన్నాయి. స్థానిక పరిరక్షకులు చర్యలోనికి దిగారు, వాటిని ఉంచడానికి అపారమైన కృత్రిమ ఇసుక ఒడ్డును నిర్మించారు. సైకతం శిల్పకళా సంస్థ సహాయంతో, వారు రాబోయే సంవత్సరాల్లో పక్షులు ఆ ఇసుకలో నివాసం ఉండేలా ఏర్పాటు చేశారు.

ఈ జాలితోకూడిన దయగల క్రియ యేసు తన శిష్యులను ఓదార్చడానికి ఉపయోగించిన పదాలు స్పష్టంగా వర్ణిస్తాయి. తాను వెళ్ళిపోతాడని, వారు తనతో పాటు వెళ్ళలేరని వారికి చెప్పిన తరువాత (యోహాను 13:36), పరలోకంలో “[వారి] కోసం ఒక స్థలమును సిద్ధపరుస్తాడని” వారికి అభయం ఇచ్చాడు (14:2). యేసు త్వరలోనే వారిని విడిచిపెడతానని, వారు ఆయనను వెంబడించలేరని చెప్పిన విషయమును వారు సరిగ్గానే విచారించినప్పటికీ, మనల్ని, వారిని కూడా స్వీకరించడానికి తన సిద్ధపాటులో భాగంగా ఈ పవిత్ర కార్యాన్ని చూడమని వారిని ప్రోత్సహించాడు.

యేసు ప్రభువు చేసిన సిలువ త్యాగం లేకుండా, తండ్రి ఇంటిలోని “అనేక నివాసాలు” మనం స్వీకరించలేం (వ. 2). సిద్ధపరచుటకు మనకంటే ముందుగా వెళ్ళి, క్రీస్తు తిరిగి వస్తాడని తన సిలువ త్యాగాన్ని విశ్వసించేవారిని తనతో పాటు తీసుకువెళతానని నిశ్చయిత ఇచ్చాడు. అక్కడ మనం సంతోషకరమైన నిత్యత్వంలో ఆయనతో నివాసం ఉంటాము. 

- కర్ స్టన్ హోమ్ బర్గు

ఈ జీవితంలో నీకు గృహంలో లేనట్లుగా ఎప్పుడు అనిపించింది? పరలోక విషయమై 
నీవు ఎక్కువగా దేని కోసం ఎదురు చూస్తున్నావు?
యేసు ప్రభూ, నీతో పాటు పరలోకంలో నా కోసం ఒక స్థలాన్ని సిద్ధం 
చేసినందుకు వందనాలు.

మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. [ ఆదికాండము 1:28 ]