ఆనందాన్ని ఎంచుకోండి


  • Author: Our Daily Bread
  • Category: Our Daily Bread
  • Reference: Sajeeva Vahini

పళ్ళు కూరగాయలు నిలువ చేసే స్థలం వద్ద తడబడినప్పుడు కీత్ నిరాశకు గురయ్యాడు. పార్కిన్సన్స్ వ్యాధి యొక్క మొదటి సంకేతాలను చేతులు వనకడంతో గమనించాడు. అతని ఆరోగ్యకరమైన జీవితం చేజారిపోవడానికి ఎంతకాలం? అతని భార్య బిడ్డలు దీనిని ఎలా అర్థం చేసుకోగలరు? ఎటువంటి ప్రయోజనం లేని, చక్రాల కుర్చీలో నవ్వుతున్న అబ్బాయిని ఒక వ్యక్తి సరదాగా తోసాడు. ఆ వ్యక్తి చిరునవ్వు ఆపుకోలేక తన కొడుకు వైపు ఆనుకొని నెమ్మదిగా ఏదో చెప్పాడు. అతడు కీత్ కంటే అధ్వానమైన స్థితిలో ఉన్నప్పటికీ, అతడు మరియు అతని తండ్రి ప్రతిచోట ఆనందాన్ని పొందుకుంటున్నారు.

అపొస్తలుడైన పౌలు తన విచారణ ఫలితం కోసం ఎదురుచూస్తూ చెరశాల నుండి గానీ లేదా గృహనిర్భందం నుండి గానీ, ఆనందంగా ఉండుటకు అవకాశం లేనప్పటికీ సంఘములను బలపరుచుటకు పత్రికలు వ్రాసాడు (ఫిలిప్పీయులు 1:12-13). నీరో చక్రవర్తి, హింస, క్రూరత్వం విషయంలో గొప్ప ఖ్యాతిని కలిగి ఉన్న దుర్మార్గుడు, కాబట్టి పౌలు ఆందోళన చెందడానికి కారణం ఉంది. తాను లేడు అన్న విషయాన్ని ఆసరా చేసుకుని కొందరు బోధకులు తమ ఖ్యాతి కోసమే పని చేస్తున్నారని కూడా తెలుసు. అపొస్తలుడు బందీగా ఉన్నప్పుడు “శ్రమ తోడు చేయవలెనని” వారు తలంచారు (వ. 17).

అయినప్పటికీ పౌలు సంతోషించడాన్నే ఎంచుకున్నాడు (వ. 18-21), తన మాదిరిని అనుసరించమని ఫిలిప్పీయులకు చెప్పాడు: “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి!” (4:4). మన పరిస్థితి అస్పష్టంగా అనిపించినప్పటికీ, యేసు ఇప్పుడు మనతో ఉన్నాడు, మన అద్భుతమైన భవిష్యత్తుకు ఆయన హామీ ఇచ్చాడు. సమాధి నుండి లేచి బయటికి వచ్చిన క్రీస్తు, తనతో జీవించుటకు తనను వెంబడించు వారిని లేపుటకు తిరిగి వస్తాడు. ఈ క్రొత్త సంవత్సరాన్ని మనము ప్రారంభిస్తుండగా, మనం ఆనందిద్దాం!            

- మైక్ విట్మర్

ఏ వ్యక్తిగత బాధ లేదా జరిగిన అన్యాయం మిమ్ములను మీ దుఃఖంలో కొట్టుమిట్టాడేలా చేస్తుంది? యేసు యొక్క సత్యం మీకు ఎలా సంతోషాన్నిస్తుంది?

తండ్రీ, నా దృష్టిని నా పరిస్థితులకన్న పైగా పెంచండి. ఆనందం కోసం నేను నీ వైపే చూస్తున్నాను.

బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి లో నీవు స్వల్పగ్రామమైనను ..... ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును... [ మీకా 5:2 ]