నిలకడ కలిగిన విస్వాసయోధురాలు – హతసాక్షి- సిసిలియా


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: 40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
  • Reference: Sajeeva Vahini

40 Days - Day 18
నిలకడ కలిగిన విస్వాసయోధురాలు – హతసాక్షి- సిసిలియా

సిసిలియా, క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైన యువతి. తాను సంగీత విద్వాంసురాలు కూడా. అచంచలమైన విశ్వాసం, దేవుని పట్ల భక్తి మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తన జీవితం ఉదాహరణగా నిలబడింది. జీవితంలో ఎదురయ్యే పరీక్షల మధ్య కూడా దేవునితో మనకున్న సంబంధంలో అందం, బలం మరియు ఉద్దేశ్యాన్ని కనుగొనేలా ఆమె కథ మనకు స్ఫూర్తినిస్తుంది.

సిసిలియా 2వ లేదా 3వ శతాబ్దంలో రోమాలో నివసిస్తున్న క్రైస్తవ యువతి. ఆమె తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసింది, కన్యగా ఉండి, ఆయనకు నమ్మకంగా సేవ చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేసింది. తన క్రైస్తవ విశ్వాస విషయంలో హింసను ఎదుర్కొన్నప్పటికీ, సిసిలియా క్రీస్తు పట్ల తన నిబద్ధతలో స్థిరంగా ఉండి, ప్రార్థనలో, ఆరాధనలో ఓదార్పు మరియు బలాన్ని పొందింది.

1 దినవృత్తాంతములు 16:23-24. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి.." 

సిసిలియాకు దేవుడి పట్ల ఉన్న భక్తి తో పాటు సంగీతం పట్ల ఎంతో ఆసక్తి కలిగియుండేది. ఈ లోకంలో శక్తివంతమైనది ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని ఆరాధించడమే అని బలంగా నమ్మేది. సిసిలియా తన ప్రతిభను సంగీతంలో ప్రదర్శిస్తూ తన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా అద్భుతమైన పాటలతో దేవుని మహిమపరుస్తూ వాటిని సుళువుగా అధిగమించేది. తనకు కలిగియున్న వాటిని పేదలకు పంచేది. ఈ కారణంగా, 3వ శతాబ్దంలో, ఆమె మొదట కాల్చివేయబడి, శిరచ్ఛేదం చేయబడింది.

తన విశ్వాస విషయంలో హింసను ఎదుర్కొన్నప్పుడు సిసిలియా యొక్క స్థిరమైన విశ్వాసం పరీక్షలగుండా ప్రయాణించింది. హింస మరియు మరణ బెదిరింపులు ఉన్నప్పటికీ, సిసిలియా తన విశ్వాసాన్ని వదులుకోవడానికి నిరాకరించింది, తన చివరి శ్వాస వరకు క్రీస్తు పట్ల తన విధేయతను ధైర్యంగా ప్రకటించింది.

సిసిలియా జీవితం మన విశ్వాసం ఎంత లోతుగా ఉందో పరిశీలించడానికి సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఆరాధన యొక్క శక్తి, అది మనల్ని దేవునికి దగ్గరవ్వడానికి, ఇతరులను ప్రేరేపించడానికి ఒక సాధనంగా ఉందని గుర్తించగలమా?

సిసిలియా వలే, కష్ట సమయాల్లో ఆయన మనకు ఆశ్రయం మరియు బలం అని తెలుసుకుని, దేవునితో మన సంబంధంలో బలాన్ని మరియు ధైర్యాన్ని పొందుదాం. మనం ఎదుర్కొనే సవాళ్లతో సంబంధం లేకుండా మన సమార్ధ్యాలు, వరాలు, మరియు ప్రతిభను ఆయనను మహిమపరచడానికి మరియు మన చుట్టూ ఉన్నవారికి క్రీస్తు ప్రేమను పరిచయం చేసే సాధనాలుగా సిద్దపడుదాము. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/LQOKnWc1iZo

40 Days - Day 18.
Cecilia: A Melody of Faith and Resilience

Cecilia, a revered figure in Christian history and the patron saint of music, exemplifies a life of unwavering faith, devotion to God, and resilience in the face of adversity. Her story inspires us to find beauty, strength, and purpose in our relationship with God, even amidst life-s trials.

According to tradition, Cecilia was a young Christian woman living in Rome during the 2nd or 3rd century AD. She dedicated her life to Christ, pledging to remain a virgin and serve Him faithfully. Despite facing persecution for her Christian beliefs, Cecilia remained steadfast in her commitment to Christ, finding solace and strength in prayer and worship.

Cecilia-s devotion to God extended to her love for music, which she believed to be a powerful means of worship and praise. Cecilia possessed a beautiful singing voice and used her musical talents to glorify God, even in the darkest of times.

"Sing to the LORD, all the earth; proclaim his salvation day after day. Declare his glory among the nations, his marvelous deeds among all peoples." - 1 Chronicles 16:23-24

Cecilia-s unwavering faith and resilience were put to the test when she faced persecution for her Christian beliefs. Despite the threats of torture and death, Cecilia refused to renounce her faith, bravely proclaiming her allegiance to Christ until her last breath. She used to distribute her possessions to the poor. Because of this reason, during 3rd Century, she was first burned and then beheaded.

Cecilia-s life challenges us to examine our own commitment to Christ and the depth of our devotion to Him. Are we willing to stand firm in our faith, even when faced with opposition or persecution? Do we recognize the beauty and power of worship as a means of drawing closer to God and inspiring others?

Like Cecilia, may we find strength and courage in our relationship with God, knowing that He is our refuge and strength in times of trouble. May we use our gifts and talents to glorify Him and spread His love to those around us, regardless of the challenges we may face.

English Audio: https://youtu.be/zIharEAVuUc

SajeevaVahini.com