ఒక విశ్వాసి అంతరంగిక జీవితములో జరిగిన వాస్తవతకు బహిర్గత సాక్ష్యమే క్రైస్తవ బాప్తిస్మము అని బైబిలు చెప్పుతుంది. ఒక విశ్వాసి క్రీస్తు ద్వార మరణములో, సమాధిలో మరియు పునరుత్థానములో ఐక్యమగుటకు సాదృశ్యమే క్రైస్తవ బాప్తిస్మము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడ పాతి పెట్టబడితిమి (రోమా 6:3-4) అని బైబిలు ప్రకటిస్తుంది. నీటిలో ముంచబడుట అనే ప్రక్రియ క్రీస్తు మరణము, సమాధికి సాదృశ్యముగా నున్నది. అదే విధంగా నీటిలోనుండి బయటకు రావటం క్రీస్తు పునరుత్థానమునకు సాదృశ్యముగానున్నది.
క్రైస్తవ బాప్తిస్మములో ఒక వ్యక్తి కనీసము రెండు అవసరతలు నెరెవేర్చాలి. 1). ఆ వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకుడుగా నమ్మియుండాలి. 2). బాప్తిస్మము దేనిని సూచిస్తుందో దానిని బాగుగా ఎరిగియుండాలి. ఓ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి, బాప్తిస్మము అనేది క్రీస్తునందున్న విశ్వాసి అని బహిర్గతం చేయమన్న ఆఙ్ఞ అని గ్రహించి బాప్తిస్మము పొందుటకు ఆశపడినట్లయితే ఆవ్యక్తి బాప్తిస్మము పొందకుండాల్సిన అవసరతలేదు. బైబిలు ప్రకారము క్రైస్తవ బాప్తిస్మము ప్రాముఖ్యమైంది, ఎందుకంటే- క్రీస్తునందున్న విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని బాహాటముగా ప్రకటించాలన్న ఆఙ్ఞకు విధేయత. మరియు క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానములకు గుర్తింపు.