విధేయత వలన విజయోత్సవాలు
సముద్రంపై రేగిన తుపాను తమను
యేసునుండి వేరుచేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు,
యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. ఇలాటి సమయాల్లోనే కష్టాల ముల్లు గుచ్చుకుంటుంది. "ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది?" దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు కలిగింది.
యేసును నీ నుండి వేరుచెయ్యడానికి కాదు; నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆత్రుతగా హత్తుకోవాలనే!
మనల్ని వదిలేసాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి. ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగునూ ఆదరణనూ అనుభవిద్దాము. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు గాని విధేయతతో ఆయన మీదే ఆశపెట్టుకుందాము. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం.
మనము చూడగలిగినా లేకున్నా
దేవుడు మనందరి యెడల తన కార్యములు జరిగించును. ఆయన మన వ్యక్తిత్వాన్ని తన కుమారుడైన
క్రీస్తు వ్యక్తిత్వం వలె మార్చుటకు అనుదినం పనిచేయుచున్నాడు. ఆయన తన పని పూర్తయ్యే వరకూ శ్రమిస్తాడు, ఆ విషయములో ఎటువంటి సందేహము లేదు. ఆరంభించినవాడు, ఆనందంలో నడిపిస్తూ, అంతము వరకు నడిపించేవాడు ఆయనే గనుక ఆయనకు సహకరించుటయే మన యొక్క విధి.
మనం పొందే విజయాలను గూర్చి
క్రీస్తు అనుదినం శ్రమిస్తున్నప్పుడు, విధేయతతో ఆయనను అనుసరించి ఆ వెలుగును మన జీవితాల్లో కలిగినప్పుడే అట్టి విజయాన్ని చవి చూస్తాము. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించే
క్రీస్తు, మనల్ని తన రూపంలోనికి మార్చుకుంటున్న మన జీవితాల్లో ఇప్పుడు ఎల్లప్పుడూ విజయోత్సవాలే కదా! దేవుని కృప మీతో మనందరితో ఉండును గాక.
ఆమేన్
Telugu Audio: https://youtu.be/l7YlfGlNkxY