క్రీస్తులో ఆనందం, మీ విజయాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

క్రీస్తులో ఆనందం, మీ విజయాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.

ఒక ఉపాద్యాయుడు ఓ రోజు కొంతమంది విద్యార్థులను ఒక తోటలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ రెండు రోజుల క్రితం నాటిన మొక్కను చూపించి "దానిని పెరికివెయ్యండి" అన్నాడు. ఒక విద్యార్థి ముందుకు వచ్చి మొక్కను పట్టుకుని లాగివేసాడు. ఉపాద్యాయుడు కొంతదూరంలో వారం క్రితం నాటిన మొక్కను చూపించి "దానిని కూడా తీసివెయ్యండి అన్నాడు. విద్యార్థి దానిని సులభముగా పీకివేసాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి నెల రోజుల క్రితం నాటిన మొక్కను చూపించి "దానిని కూడా పెళ్ళగించండి" అన్నాడు.  విద్యార్థి కాస్త కష్టపడి తీసేసాడు. అలాగే  అక్కడ ఒక సంవత్సరం క్రితం నాటిన మొక్కను చూపించి "ఇది ఇప్పుడు బాగా పెరిగింది, పెద్ద వృక్షం అయ్యింది, తొలగించండి" అని విద్యార్ధులకు చెప్పాడు ఉపాద్యాయుడు. అప్పుడు ఆ విద్యార్థులు దాన్ని తొలగించడం మా వల్ల కాదు అన్నారు.

విద్యర్థులు అప్పుడే పెరిగిన మొక్కలను, లేత వయసు గల మొక్కలను తొలగించగలిగారు. కాని చాలా కాలం నుండి పెరిగి పెద్దగా మారిన వృక్షాన్ని తొలగించలేకపోయారు. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం అది ఒక మొక్క, ఇప్పుడు అది ఒక చెట్టు, దాని వ్రేళ్ళు భూమిలో ప్రాకి బలంగా నాటుకుపోయి ఉంది. అదే విధముగా మన జీవితములో పాపం కూడా. పాపము అని తెలిసిన వెంటనే దానిని తొలగించడం సులభం.  ఈ వయసులో కాకపోతే మరి ఏ వయసులో ఎంజాయ్ చేయాలి? అంటూ... తాత్కాలిక ఆనందం కోసం పాపాన్ని పెంచి పోషించినప్పుడు అది పెరిగిపెద్దై హృదయంలో బలముగా నాటుకుపోతుంది.

ఆ పాపానికి బానిసలుగా మారిపోతారు. ఆ పాపమే మనల్ని పట్టుకుంటుంది. (సంఖ్యా 32:23). మనం పెంచి పోషించిన ఆ పాపమే మన జీవితాన్ని చిక్కుల్లో పడవేస్తుంది, నాశనం చేస్తుంది (హెబ్రీ 12:2). చివరకు ఒక దినాన ఆ పాపం వలన ఎటువంటి సంతోషంలేదని గ్రహించి, దేవునికి దూరం అయ్యి, ఆశీర్వాదాలు కోల్పోయి, జీవితంలో శాంతి సమాధానం లేక, తెలిసి చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవిస్తూ రోదిస్తూ ఏడుస్తున్నవారు కొందరైతే: ఆత్మహత్య చేసుకొన్నవారు మరి కొంతమంది. దేవుడు మిమ్మల్ని పాపం నుండి విడిపిస్తాడు, ఇకపై పాపం జోలికి వెళ్ళకుండా అయన కొరకు సాక్షిగా జీవించండి. యేసులో ఆనందం శాశ్వతమైనది, ఈ లోక (పాపపు) ఆనందం కేవలం తాత్కాలికమైంది అని గుర్తుంచుకోండి. క్రీస్తులో ఆనందం, మీ విజయాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/pgDVKzSglgc