ఆయన మన పక్షముగా యుద్ధముచేస్తే విజయోత్సవాలే
1740 లో అమెరికా దేశంలో ఇప్స్విచ్ అనే ప్రాంతంలో సువార్తికుడైన రెవ. జార్జ్ విట్ ఫీల్డ్, ఆ ప్రాంతంలో ఉన్న చర్చీలో సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. అక్కడే ఉన్న ఒక అగ్నిపర్వతం నుండి వెలువడిన గ్రైనైట్లో ఒక పాదము ఆకారములో నున్న పాదముద్రను ఆ ప్రాంత ప్రజలంతా గమనించారు. “దెయ్యం యొక్క పాదముద్ర” (The Devil’s Footprint, 1970) అని కూడా పిలిచేవారు. వాస్తవానికి ఈ సువార్తుకుడు ఎంతో బలమైన రీతిలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు, ఎన్నో సంవత్సరాలుగా వారిని పీడిస్తున్న ఒక దయ్యం గుడి గోపురముపై నుండి ఒక బండపైకి దూకి ఊరినుండి పారిపోయిందని ఆ పాదముద్రను చూసిన ప్రజలంతా అభిప్రాయపడ్డారు. తమ జీవితాలు ఆ సువార్త వైపు ఆకర్షించబడ్డారు.
మనకు ఇది కధనంలా అనిపించినా, అది దేవుని వాక్యములో నుండి ఒక ప్రోత్సాహకరమైన సత్యాన్ని మనకు గుర్తుచేస్తుంది.
యాకోబు 4:7లో “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును” అని గుర్తు చేసింది.
శత్రువుని ఎదిరించి మన జీవితాల్లో శోధనలను తట్టుకొని నిలబడడానికి అవసరమైన బలాన్ని
దేవుడు మనకు దయజేస్తాడు.
యేసు క్రీస్తు ద్వారా దేవుని ప్రేమ కలిగిన కృపనుబట్టి “పాపము మీ మీద ప్రభుత్వము చేయదు” (
రోమా 6:14) అని బైబిల్ వివరిస్తుంది. శోధన ఎదురైనప్పుడు లోకమును జయించిన
క్రీస్తు దగ్గరకు పరిగెడితే, ఆయన శక్తితో మనము నిలబడడానికి సహాయము చేస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఎదుర్కొనేది
ఏదీ ఆయనను జయించలేదు.
మన చిత్తాలను ఆయన ఆధీనములోనికి తెచ్చుకుంటూ దేవుని వాక్యానికి విధేయులమై నడుచుకుంటే మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. శోధనలకులోనయ్యే బదులు ఆయనకు మనల్నిమనం అప్పజెప్పుకుంటే, ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తాడు. ఆయనలో మనము జయాన్ని పొందగలము. నేను బలహీనుడను అని అనుకుంటున్నారా? అతి బలహీనుడైన పరిశుద్ధుడి ప్రార్ధన సైతము
సాతానుకి వణకుపుట్టిస్తుంది. హల్లెలూయ. ఆమెన్.
Telugu Audio: https://youtu.be/-QJ9CLK-t7g