ఎక్కడ వెదకుచున్నావు...?
...సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? (
లూకా 24:5) ఇది పరలోకం నుండి వచ్చిన దూత స్త్రీలతో మాట్లాడిన సందర్భం
యేసు ప్రభువు తిరిగి లేస్తానని చెప్పిన మాట మర్చిపోయిన స్త్రీలు,
యేసు దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయవలెనని సమాధి దగ్గరకు వచ్చారు.
యేసు చనిపోయాడని, ఆయనను వెంబడించిన శిష్యులు భయపడి దాగుకొన్నారు.
మృతులలో అనగా సమాధిలో ఏముంటుంది? దుఖము, భయం, నిట్టూర్పులు ఉంటాయి. మృతులలో వెదకేవారికి వాక్యము మీద నమ్మకం ఉండదు. దేవుని మీద విశ్వసం ఉండదు. వాగ్దానము కొరకు నిరీక్షించలేరు. అందుకనే
యేసు చెప్పిన మాటలు మర్చిపోయి మృతులలో వెదకుచున్నారు. మన
యేసు ప్రభువు యుగయగములు సజీవుడైయున్నాడు. నేను సజీవుడనని
యేసు ప్రభువు ఎందుకు చెప్పాడంటే; మరణము జయించాను కాబట్టి సమస్తము నా ఆధీనములో ఉన్నవి నేనేమైన చేయగలను అని
యేసు ప్రభువు ప్రకటించారు.
ఈ రోజు
యేసు ప్రభువు మృతులలో నుండి, సమాధి జయించి లేచాడని నీవు నమ్మగలిగితే భయం, అవిశ్వాసం నీలో ఉండదు.
యేసు ప్రభువు మరణం జయించాడని నమ్మకపోతే ఆ స్త్రీల సమాధిని అలంకరించాలని తలంచినట్లు, మనము కూడా అందమైన బైబిల్లతో, సిలువలతో అలంకరించుకుంటాము. అదే
యేసు ప్రభువు మరణమును జయించాడని విశ్వసిస్తే - వాక్యం హృదయంలో, సిలువ భుజానా ఉంటుంది. నీకున్న సమస్యలలో, శ్రమలలో మృతులలో వెదకుచున్నావా లేదా మరణమును జయించిన సజీవుడైన
యేసు ప్రభువు సన్నిధిలో వెదకుచున్నావా?
నీవు ఆయన సన్నిధిలో గనుక ప్రార్థనలో వెదకుచు ఉంటే నీలో ధైర్యం, నీలో విశ్వాసం, నీలో నిరీక్షణ ఉంటుంది. ఒకవేళ మృతులలో వెదకుతూవుంటే, మృతులలో అనగా ఈలోకంలో, సమాధిలో సమాధిలో కుళ్లు ఉంది, సమాధిలో సంతోషం ఉండదు, సమాధిలో నిరీక్షణ ఉండదు ఏమాత్రం కూడా శుభ వచనాలు ఉండవు. అందుకే సమాధిలో గనుక ఈలోకంలో వెదకుతే నీలో భయం ఉంటుంది, నీలో అవిశ్వాసం ఉంటుంది కాబట్టి ధైర్యంతో దేవుని దగ్గరకు రాలేవు. మన
దేవుడు సజీవుడు అనేది గుర్తించుకోవాలి. ఆయన మరణమును జయించాడు అని మనం గుర్తించి ఆయన దగ్గరకు రాగలుగితే ఎలాంటి సమస్యయైన అది ఎంత పెద్దదైన దానిని సులువుగా జయించగలుగుతాము. ఎందుకంటే మరణమును జయించిన
దేవుడు ఆయనను నమ్మిన వారికి సమీపముగా ఉంటాడు.