ఆదర్శవంతమైన జీవితం


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

ఆదర్శవంతమైన జీవితం 

లూకా 24:19 ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను.

ఒక వ్యక్తిని ఏది నమ్మకమైన వానిగా చేస్తుందని ఆలోచన చేసినప్పుడు, వారి మాటలు మరియు క్రియలు సమానంగా ఉండి, వారి మంచి గుణాలనుబట్టి అర్ధం అవుతుంది.
దేవుని కుమారుడైనప్పటికీ కూడా యేసు తాను బోధించిన ప్రతీదీ అనుసరిచుటలో మనకు పరిపూర్ణ ఉదాహరణగా నిలిచాడు.
యోసేపు మరియ కుమారినుగా జీవిస్తున్నప్పుడు, క్రమం తప్పకుండా ప్రార్థనా మందిరానికి వెళ్తూ అందరి దృష్టిలో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు. చివరికి సర్వ మానవాళి కోసం తన జీవితాన్ని కూడా అర్పించాడు.

అంతేకాదు, సిలువ వేయబడిన సమయంలో కూడా సత్యానికే కట్టుబడి ఉండడం ఎంతో మహిమాన్వితమైనది.
ఈరోజు, దేవుని వాక్యంతో మనల్ని మనం సన్నద్ధం చేసుకునేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేద్దాం, ఇది దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపడానికి సహాయపడడమే కాకుండా మన జీవితాలే క్రీస్తును ప్రకటించేలా చేస్తాయి. పరిశుద్ధ గ్రంధంలో నాలుగు సువార్తలు క్రీస్తును గూర్చి ప్రకటిస్తుంటే, దైవ చిత్తానుసారమైన జీవితం జీవించే వ్యక్తి జీవితం, ఐదవ సువార్తగా అనేకులకు సాక్షిగా నిలిచిపోతుంది. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/9R1d_p6aki8