నిరాశకు గురైనప్పుడు!


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini

నిరాశకు గురైనప్పుడు!

కీర్తనల గ్రంథము 77:6 - నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.

శ్రమల రోజులన్నీ ప్రార్థన రోజులుగా ఉండాలి; తీవ్రమైన కష్టాల కొలిమిలో ఉన్నప్పుడు, ప్రత్యేకించి దేవుడు మన నుండి వైదొలిగినట్లు అనిపించినప్పుడు, మనం ఆయనవైపు తిరగాలి మరియు ఆయనను కనుగొనే వరకు వెతకాలి. కొన్నిసార్లు ఒదార్పునిచ్చే  కొన్ని సందర్భాలు మనకు వ్యతిరేకంగా పనిస్తున్నప్పుడు, మనం తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు, దేవుణ్ణి వెతకడం కంటే మరొకటి లేదు.

చాలా తరచుగా విశ్వాసి దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు మరియు అతను లేదా ఆమె తమ మనవిని దేవుడు విన్నట్లు గ్రహించినప్పుడు, అది ఆ విశ్వాసానికి శాంతియుతమైన హామీని కలుగజేస్తుంది. అన్ని సందర్భాల్లో కాకపోయినా, కొన్నిసార్లు - ప్రత్యేకించి మనం ఎటువంటి మార్పును చూడలేనప్పుడు కష్టంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు, దాని నుండి విముక్తి పొందే బదులు - దేవుడు మన విజ్ఞాపలన్నీ వినినప్పటికీ మన కష్టాల నుండి విడిపించే మార్గం ఇంకా పొందుకోలేని నిరాశ మరింత పెరిగిపోతుంది. ఈ పోరాటాల గమనం దేవునితో తమ సంబంధాన్ని కొనసాగించడానికి కొంత దూరం ప్రయాణించిన విశ్వాసికి మాత్రమే అర్ధమవుతుంది.

దేవుని విశ్వసనీయతను గుర్తుంచుకోవడం అనేది మన ఆరాధనను గూర్చి నేర్పించే ప్రధానమైన బైబిల్ ఆదేశాలు. భవిష్యత్తు కోసం దేవునిపై మన విశ్వాసానికి అది ఆజ్యం పోస్తుంది. మీరు గతంలో దేవుని విశ్వసనీయతను గుర్తించినప్పుడు, మీరు రేపటి కోసం నిరీక్షణతో అలసిపోయిన మీ హృదయాన్ని పరిష్కరిస్తారు.నేనంటాను, భవిష్యత్తు కోసం మీ ఆశను రేకెత్తించడానికి మీ ఆలోచనలను దారి మళ్లించే మార్గాన్ని ఎంచుకోండి. అప్పుడు మీ ఆలోచనల్లో దేవుని కృపగల కొత్త కోణాన్ని చవిచుస్తారు. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/c0XllhMFBSY