దేవునికి సమర్పించుకోవాలి | Submit to God


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

దేవునికి సమర్పించుకోవాలి

హెబ్రీయులకు 12:9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి.  వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?

ఈ మాటలు దేవుని అధికారానికి లొంగిపోవడం మరియు మన జీవితాల కోసం ఆయన ప్రణాళికను విశ్వసించడం యొక్క ప్రాముఖ్యతను గూర్చి మనకు గుర్తు చేస్తోంది. మనము మన పరలోకపు తండ్రిగా దేవుని వైపు చూడాలి, బలం మరియు మార్గదర్శకత్వం కోసం ఆయనపై పూర్తిగా ఆధారపడాలి. ఆయన మనలను ప్రేమిస్తున్నాడని మన కోసం మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడని మనం పూర్తిగా నమ్మవచ్చు. మనం దేవుని అధికారానికి లొంగిపోయినప్పుడు, మన జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని పొందవచ్చు. మనకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసునని మరియు మనం అర్థం చేసుకోలేని మార్గాల్లో మనకు అందిస్తాడని మనం నమ్మవచ్చు. 

జీవితం కష్టంగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని కూడా మనం నమ్మవచ్చు. మన భూసంబంధమైన తండ్రులను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. వారి సలహాలను వినడం ద్వారా, వారి మార్గదర్శకత్వాన్ని అనుసరించడం ద్వారా మనం వారిని గౌరవించిన వారమవుతాము. వారు మనకు నేర్పించే జీవితమును గూర్చిన విలువైన పాఠాలు, వారు  మనకు నేర్పిన విధానానికి కూడా మనం కృతజ్ఞత కలిగి యుండాలి. మనం దేవుని అధికారానికి లోబడి, మన భూసంబంధమైన తండ్రులను గౌరవించినప్పుడు మనం ఆనందం మరియు శాంతితో జీవించగలము. దేవునికి లోబడాలని మరియు మన భూసంబంధమైన తండ్రులను గౌరవించాలని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/OhMVJ8FLB10

Submit to God

Hebrews 12:9 Moreover, we have all had human fathers who disciplined us and we respected them for it.  How much more should we submit to the Father of our spirits and live!

This word from the bible is reminding us about the importance of submitting to Gods authority and trusting in His plan for our lives. We should look to God as our heavenly Father and rely on Him for strength and guidance. We can trust that He loves us and has good plans for us. When we submit to Gods authority, we can find peace and joy in our lives. We can trust that He knows what is best for us and will provide for us in ways that we may not understand. We can also trust that He will never leave us or forsake us even when life is hard. This passage also reminds us of the importance of respecting our earthly fathers. We can honour them by listening to their advice and following their guidance. 

We can also be thankful for the way they have provided for us and taught us valuable lessons. As we submit to Gods authority and respect our earthly fathers we can live with joy and peace. We can trust that God will provide for us and give us strength to face whatever comes our way. We can also be thankful for the way our earthly fathers have provided for us and taught us valuable lessons. May we always remember to submit to God and respect our earthly fathers.

English Audio: https://youtu.be/68SLyknwN2A