సంతృప్తి
చిన్న బిడ్డలు తమ తలిదండ్రులు చెప్పిన పనులు చేయనప్పుడు, పెద్దలు వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మాటలతో కుదరనప్పుడు బెత్తంతో చెప్పే ప్రయత్నం సుళువైనప్పటికీ, ఇరువురి మధ్య సంధి ఏర్పడడానికి మరో మార్గాన్ని వెతుక్కుంటారు. నేను చెప్పిన పని చేస్తే నీవు అడిగింది ఇచ్చేస్తాను. అవును, మనమందరం ఈ అనుభవంగుండా వచ్చినవాళ్ళమే. మనం పనిచేసే స్థలంలో కూడా చేసిన పనిని ప్రోత్సాహ పరిచే బహుమతులు మరింత బలాన్ని ఉత్సాహాన్ని దయజేస్తాయు. అసాధారణమైన పనులు చేయడానికి మనం పొందుకునే జీతము మనలను అది పురికొలుపుతుంది అనుటలో ఎట్టిసందేహం లేదు.
అయితే దేవుడు నిజానికి మనకును ఇటువంటి ప్రేరణను దయజేశాడు. కేవలము ఊరకనే విధేయులమవ్వమని ఆజ్ఞాపించకుండా, తనను వెంబడించే జీవితము, క్రయంతో కూడినదే అయినా, సమృద్ధియైన జీవముతో నిండుకొనియున్నది, “గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని” (యోహాను 10:10) లో యేసయ్య వాగ్ధానం చేశాడు. ఆయనను వెంబడిస్తే “ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా... రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని” (మార్కు 10:29,30) ఆయన వాగ్ధానము చేశాడు.
ప్రియమైన స్నేహితులారా, మనము దేనికి అర్హులమో దానినిబట్టి ప్రతిఫలమివ్వని, శిక్షించని ఔదార్యుడైన దేవునిని సేవిస్తున్నామన్న వస్తవాన్ని బట్టి మనము సంతోషించవచ్చు. పాత నిబంధనకు చెందినవారిపట్ల ఆయన చూపించిన ఉదారము, నేడు ఆలస్యముగా వచ్చిన మనలను కూడా ఆహ్వానించి ప్రతిఫలమిస్తూ, ఆయన మన అతి బలహీన ప్రయాసలను కూడా ఉదారముగా అంగీకారిస్తూ ఉన్నాడు (మత్తయి 20:1-16). ఈ వాస్తవపు వెలుగులో నేడు ఆయనను ఉత్సాహముతో సేవించుటకు ప్రయత్నము చేయగలిగితే గొప్ప సంతోషం పొందగలం. అవును, ఉత్తమమైన సంతృప్తి కలిగిన జీవితానికి ఏకైక మార్గం యేసును వెంబడించడమే. ఆమెన్.
https://www.youtube.com/watch?v=BkDHZqwAUl8