విశ్వాస వారసత్వం


  • Author: Dr G Praveen Kumar
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

విశ్వాస వారసత్వం
Audio: https://youtu.be/q1hR2-CY3zc

ఒకానొక ఊరిలో 8ఏళ్ల వయసులో ఉన్న ఒక పిల్లవాడు తన ఇంటి వాకిట కూర్చొని; చుట్టి ఉన్న ఒక కాగితపు ముక్కను నోట్లో పెట్టుకొని సిగరెట్టు తాగినట్టు నటిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం కలిగిన నాకు అతని తల్లిని అడిగాను, తన పిల్లవాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడా అని. ఆ తల్లితో జరిగిన సంభాషణను బట్టి అర్ధం అయింది, ఆ పిల్లవాని తండ్రికి పోగత్రాగే అలవాటు ఉన్న కారణంగా, అది చూసిన ఈ పిల్లవాడు తన తండ్రిని అనుకరిస్తున్నాడని అర్ధం అయింది. మన బిడ్డలు మనల్ని కాకపొతే ఇంకెవరిని అనుకరిస్తారు? మన అలవాట్లు మన నడవడినే కదా.

ద్వితియోపదేశకాండము 6వ అధ్యాయములో లిఖితం చేయబడిన మాటలు ఈ అనుభవాన్ని అద్భుతంగా వివరిస్తుంది. దేవుడు, తన ఉద్దేశాలు, తలంపులు మరియు సూచనలు, మోషేకు ఏవైతే బయలుపరచబడినవో వాటిని ఈ గ్రంథంలో పొందుపరచి... లేఖనాలను ఎరుగుటలో, దానికి విధేయత చూపించుటలో తర్వాతి తరానికి నేర్పించే ఉద్దేశాన్ని కలిగియుండమని ప్రోత్సాహించాడు. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, వాటిని భావితరాలకు చేరవేసి, ఆయనకు భయపడి, ఆయనను ప్రేమించి, భయభక్తులు కలిగియుండమని ఉపదేశించారు. దేవుని జ్ఞానాభివృద్దిచెందే కొలదీ వారు, వారి పిల్లలు ఆయనయందు భయభక్తులు కలిగి, ఎదిగి, ఆయనను సన్నిహితంగా ఎరుగుట వలన, సంపూర్ణంగా ప్రేమించుట వలన, విదేయతతో వెంబడించుట వలన వచ్చే ప్రతిఫలాన్ని ఆశ్వాదించగలరని ఆనాడు ఇశ్రాయేలీయులకును నేడు మనకును హెచ్చరికతో కూడిన సందేశాన్ని వివరించారు.

విధేయత వ్యక్తిగతమే అయినప్పటికీ, అది కుటుంబాలతో సంబంధంకూడా కలిగియుంటుందని గ్రహించాలి. (6:2-5) ఉద్దేశపూర్వకంగా మన హృదయాలను, మనసులను దేవుని లేఖనాలతో నింపుకున్నట్లయితే (6:6) మన అనుదిన కార్యక్రమాలలో దేవుని ప్రేమను, సత్యమును పిల్లలతో పంచుకోడానికి సిద్ధంగా ఉంటాము. మనం మాదిరికరమైన నడిపింపు కలిగి ఉన్నప్పుడు మారనటువంటి దేవుని సత్యానికున్న అధికారాన్ని, ఔచిత్యాన్ని గుర్తించి, గ్రహించడానికి మన యవ్వన బిడ్డలను సంసిద్ధులను చేసి, ప్రోత్సాహించడానికి వీలవుతుంది. మన హృదయంలో నుండి వచ్చే మాటల ద్వారా మరియు నడవడి ద్వారా, ఒక తరం నుండి మరొక తరానికి అందించగల విశ్వాస వారసత్వాన్ని మనం విడిచి వెళ్ళవచ్చు. ఏ మాటలతే మన హృదయంలోనికి చొచ్చుకొని పోతున్నాయో అదే మన నడవడిగా బాహ్యంగా కనబడుతుంది, అవే మన చుట్టూ ఉన్నవారి విశ్వాస స్థితిని కూడా నిర్దేశిస్తాయని గ్రహించాలి. ఆమెన్.