శ్రమల నుండి ఫలభరితమైన జీవితం
Audio: https://youtu.be/HOlZnPY-kr4
యోహాను 12:1 కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.
బేతనియ అనగా
1. House of Affliction, The state of being in pain, శ్రమల ఇల్లు
2. House of Figs అంజూరపు ఇల్లు
శ్రమలతో ఉన్న ఈ ఇల్లు ఫలభరితమైన స్థితికి ఎలా వచ్చింది అనగా సంతోషకరమైన స్థితికి ఎలా వచ్చిందో గమనిస్తే, ఈ సమయంలో నీ హృదయం భారముగా ఉంటే పరలోక సంతోషముతో నింపబడుతుంది. నీ హృదయం నలిగిపోయి ఉంటే ఆదరణతో నింపబడుతుంది.
1. యోహాను 11:1 రోగం ఉంది. లాజరు రోగి యాయెను.
2. యోహాను 11:17 శవం ఉంది/మరణం ఉంది
3. లూకా 10:38 యేసుని చేర్చుకొనిన ఇల్లు
4. యోహాను 11:35 యేసు ప్రేమించిన ఇల్లు యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొన్నారు.
5. యోహాను 11:25 విశ్వాసము కలిగిన ఇల్లు. యేసే పునరుత్థానమని నమ్మిన ఇల్లు.
6. యోహాను 11:43 అద్భుతములు కలిగిన ఇల్లు. చనిపోయి నాలుగు దినములు అయిన తరువాత కూడ యేసు పిలువగానే చచ్చినవాడు జీవముతో భయటికి వచ్చాడు.
7. యోహాను 12:1... యేసుకు విందు చేసిన ఇల్లు.
ప్రియ స్నేహితుడా! మార్త మరియ లాజరు ఇంటిలో యేసయ్య ఉండుట వలన వారి శ్రమలు నాట్యముగా మార్చబడినవి. ఈ ఇంటి పరిస్థితి వలే నీ ఇంటిలో కూడ శ్రమలు, రోగం, కన్నీళ్లు ఉన్నాయా? బాధపడకు, నీ కొరకు చింతిస్తున్న యేసు వైపు చూడు, సందేహించక దేవుడు నీ పరిస్థితి మార్చగలడని విశ్వసించు. మార్త, మరియలు యేసుని ఇంటిలో చేర్చుకొనిన రీతిగా నీవు కూడా నీ హృదయంలోనికి ఆహ్వానించు. దేవునికి ఆయాసకరమైనదేదైన ఉంటే వాటిని విడిచిపెట్టు.
శ్రమల ఇల్లుని ఫలభరితమైన ఇల్లుగా చేసిన దేవుడు నీ జీవితమును కూడా ఫలభరితముగా మార్చగలడు.
శ్రమల ఇల్లుని సంతోషకరమైన ఇల్లుగా చేసిన దేవుడు నీ జీవితమును కూడా సంతోషకరముగా చేయగలడు.
శ్రమల ఇల్లుని నిరీక్షణగల ఇల్లుగా చేసిన దేవుడు నీ జీవితమును కూడా నిరీక్షణతో నింపగలడు.
ఈ మాటలు నమ్మితే గట్టిగా ఆమెన్ చెప్పండి.