యుద్దములో గెలవాలంటే...? సామెతలు 24:1-6
Audio: https://youtu.be/XkV62U7wPQE
5వ జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.6 వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము.
జీవితములో అనేక సమస్యలతో మనం నలిగిపోతుంటాము. సమస్యలు ఒక ప్రక్కన ఉంటే, మన సమస్యలకు అసలు కారణం తెలుసుకోకుండా వారి సొంత ఉద్దేశాలను రకరకాలుగా ప్రచారం చేసే జనాలు మరో ప్రక్కన ఉంటారు. అందుకనే మొదటి వచనములో దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుమని వాక్యం సెలవిస్తుంది.
నీ ప్రపంచమును పాడుచేయ్యాలని దుష్టుడు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. నీవు కష్టపడి కట్టుకుంటున్న ఆత్మీయ జీవితమును పాడుచేయడమే వాని పని. నీ జీవితమును కాపాడుకొనుటకు ప్రతి రోజు నీవు చేసే ప్రయత్నమే యుద్ధము. ఈ యుద్ధములో నీవు గెలుస్తున్నావా, ఒడిపోతున్నావా? యుద్ధములో ఎలా గెలవాలో, గెలవడానికి ఏమి చెయ్యాలో ఈ వాక్యభాగం నేర్పిస్తుంది.
జీవితమును కట్టుకొనుటకు, కాపుడుకొనుటకు మరియు గెలచుటకు జ్ఞానము, తెలివి, వివేచన ఎంత అవసరమో గుర్తించాలి.
జ్ఞానము - చదువుట ద్వారా, అనుభవం ద్వారా లభించేది జ్ఞానము.
తెలివి - పొందుకున్న జ్ఞానమును ఎక్కడ ఎప్పుడు వాడాలో తెలిజేసేది తెలివి.
వివేచన - సమస్యలలో లేదా ఏ స్థితిలోనైన నిర్ణయం తీసుకొనుటకు కావలసింది వివేచన.
అందుకనే జ్ఞానమువలన ఇల్లు అనగా నీ జీవితము కట్టబడుతుంది. తెలివి చేత నీ జీవితం వర్ధిల్లుతుంది. వివేచనవలన నీ జీవితం స్థిరపరచబడుతుంది.
అంతమాత్రమే కాదు జ్ఞానము నిన్ను బలవంతునిగా చేస్తుంది. బలం అనగా శారీరకంగా బలమైన స్థితి. తెలివి నిన్ను శక్తిమంతునిగా చేస్తుంది. శక్తి అనగా ఏదైనా చేయగలలిగే సామర్థ్యం. వివేకము తిరుగులేని నాయకునిగా చేస్తుంది.
జ్ఞానము, తెలివి, వివేచన దొరికే స్థలమే దేవుని సన్నిద్ధితో నిండిన ప్రార్ధనా స్థలం.
ప్రతి రోజు నీ వ్యక్తిగత ప్రార్ధనలో జ్ఞానము, తెలివి, వివేచన కొరకు అడగాలి. దేవుడు ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. నీవు ఓడిపోవుటకు పిలువబడలేదు గెలచుటకే పిలువబడినావు. నీ ప్రపంచానికి నీవే రాజువు. నీ ఆలోచకర్త దేవుడు. ప్రార్ధనలో దేవుని ఆలోచన ప్రకారం యుద్ధము చేయు గెలుపు నీ ముందు ఉంటుంది.