నా నిరీక్షణకు ఆధారం యేసే
Audio:https://youtu.be/hmux6ZWLu0c
జీవితంలో మనిషి అనేక ప్రయత్నాలు చేస్తాడు అనగా, ఉద్యోగం కొరకు ప్రయత్నం, వివాహం కొరకు, డబ్బు కొరకు ప్రయత్నం ఇలా అనేక ప్రయత్నాలు చేస్తాడు కాని ఎక్కువగా ఆలోచించేది, ప్రయత్నించేది మరణం పొందకూడదనే.
పుట్టిన ప్రతి ఒక్కరు ఒక రోజు మరణించవలసిందేనని తెలసినా మరణం పేరు ఎత్తితేనే భయపడిపోతారు. బయటికి వెళ్ళినవారు క్షేమముగా వస్తారోరారని భయం. హాస్పిటల్ వెళ్ళినవారు ప్రాణంతో వస్తారోరారని భయం ఇలా ప్రతి రోజు మనిషిని మరణ భయం వెంటాడుతూనే ఉంటుంది. మరణం గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మనస్సులో ఆశ్చర్యం కలిగింది. ఎందుకనగా, క్రీస్తుని వెంబడిస్తున్న విశ్వాసి డిక్షనరీలో మరణం అనే పదం లేదు. ఒకవేళ విశ్వాసి చనిపోతే, చనిపోయాడు అనరు నిద్రించారని అంటారు.
ఒకప్పుడు భయపెట్టిన మరణం, సిలువలో యేసు ప్రభువు గెలుచుట ద్వారా మరణం మ్రింగివేయబడినది. అంతేకాదు మన మీద అధికారము చేసిన మరణమును యేసు ప్రభువు గెలిచి ఆ మరణమును మనకు ఆట వస్తువుగా ఇచ్చాడు.
ప్రియ విశ్వాసి! ఎందుకు ఈ రోజు మరణము గురించి మాట్లాడుచున్నానంటే; ఈ రోజులలో కరోనా వలన మరణ భయం అనేకులలో ఉంది. కరోనా వలన కాకపోయిన ఏదోక రోజు ఈ దేహమును మనము విడువవలసినదే. ఒక రోజు నేను మరొకరోజు మీరు కాని, మన నిరీక్షణ నిద్రించిన మనవారిని కలుసుకుంటాము లేదా ప్రభువు రాక ముందు నిద్రిస్తే సమాధిని బ్రద్దలుకొట్టి నిద్రించిన మనం లేస్తాము. ఈ ధైర్యం క్రీస్తు రక్తములో మన పాపములు క్షమించబడుట ద్వారా, ఆయనను వెంబడించుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగినది. మన నిరీక్షణకు ఆధారం యేసే.
Ref : (1 పేతురు 1:3,4), SajeevaVahini.com