విజేత! - Winner


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

విజేత!
Audio: https://youtu.be/XFfQeFIXn68

లోకము, శరీరము, అపవాది. ఈ మూడురకాలైన శత్రువులతో మనము అనుదినం పోరాటము చేస్తూ ఉన్నాము.

2 థెస్సలొనీకయులకు 3:3 అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును.

దేవుడు తన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టడు, మనం విజయవంతులంగా ఉండాలనేదే తండ్రి ఉద్దేశం. కాబట్టి, చేసిన తప్పులను తిరిగి చేయకుండా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ ఓటమి కలిగిందో అక్కడి నుండి తిరిగి మొదలు పెట్టవలసి ఉంటుంది. కోల్పోయినదానిని తిరిగి పొందడం ఎప్పుడూ బాధాకరమైనది మరియు విలువైనదని గుర్తుంచుకోవాలి. అపజయాలను విజయాలుగా మార్చడానికి; ఆశీర్వాదం ఎందుకు కలిగిందో, ఎక్కడ నుండి వచ్చిందో ఆ మూలాలు గుర్తుంచుకోవాలి.

ఆధ్యాత్మిక, సామాజిక జీవితాలలో విజేతలుగా ఉండాలని మనకూ అనిపిస్తుంది. అనుకున్నంత మాత్రాన సరిపోదు. దానికోసం లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అవసరమైన సాధన చేస్తున్నప్పుడే విజేతలుగా ఉండగలుగుతాము. విజేతలుగా ఉన్నవారిని ప్రజలు మార్గదర్శకులుగా గుర్తిస్తారు. విజేతలు అధికారానికి అర్హులౌతారు..మనము నిరంతరము విజేతలుగా ఉండాలని యేసు మనకు మార్గదర్శిగా ఉన్నాడు.

మన ఆలోచనలు, వైఖరి, ప్రవర్తన, నోరు వీటన్నిటిపై దాడిచేసి ఓడించాలని అపవాది ప్రయత్నాలు నిరంతరము జరుగుతుంటాయి. వాటన్నిటిని మన పాదముల క్రింద తొక్కాలంటే ఆయనవైపు తిరిగి "బలపరచుము" అని అడుగుతూ ప్రార్ధించి ఆయన మార్గములను వెదకినప్పుడు తప్పక విజేతలుగా నిలవగలుగుతాము. ఆమెన్!