Share on Whatsapp Daily Devotion - విచ్ఛిన్నతలో అందం

విచ్ఛిన్నతలో అందం

బహుశా మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. 2011 మార్చిలో సముద్ర భూగర్భంలో సునామి అనేక దేశాలని అతలాకుతలం చేసేసింది. అదే సమయంలో జపాన్ దేశం మాత్రం 235బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఆ దేశానికి ఎంత నష్టం మన ఊహలకు మించినది. కొన్ని వేల మంది ప్రజలు సునామి తాకిడికి గల్లంతైపోయారు, మరి కొందరికి మరణం తప్పలేదు. ఇదిలా ఉంటే, ప్రజలు నివసించే కొన్ని లక్షల భవనాలు ఆ భూకంపానికి విచ్చిన్నం అయిపోయాయి. దేశం ఆర్ధిక మాంద్యంలో ఉన్నా, ఆ దేశం తమ టెక్నాలజీ సహాయంతో అడుగులు ముందుకు వేయగల సామర్ధ్యం ఉన్నప్పటికీ, విచ్చిన్నంగా చిందర వందరగా పడిపోయిన తమ గృహాలను తిరిగి నిర్మించుకోవాలన్న విషయంలో మాత్రం ఆ దేశ ప్రజలలో నిరాశ ఎదురయ్యింది.

తదనంతరం జీవించడానికి తగిన రాబడిని, సమాజాన్ని, గౌరవాన్ని, తమ అవసరతలను తీర్చే దేవునిలో నిరీక్షణను వారిలో కలుగజేస్తూ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును సిద్దం చేసారు. దాని పేరు “నొజోమి ప్రాజెక్ట్”. ఈ ప్రాజెక్టులో పనిచేసే స్త్రీలు వారి దేశంలో విచ్చిన్నంగా పడిపోయిన పింగాణి పెంకులు, తునకలను కనుగొని వాటిని ఆభరణాలుగా అమర్చుకోవడం కోసము ఆ ఇళ్ళ శిధిలాలను రాళ్ళ రప్పాలను వేరు చేస్తూ ఉంటారు. ఆ స్త్రీలకూ ఒక జీవన ఉపాధిని సమకురుస్తూ, అదే సమయంలో క్రీస్తులో తమ విశ్వాసాన్ని బలపరుస్తూ ఈ నగరలను ప్రపంచమంతా విక్రయించడం ప్రారంభంచారు. అయితే ప్రాచిన కాలంలో మట్టి కుండల్లో నగలను దాచుకోవడం సంప్రదాయం.

క్రీస్తును వెంబడించే మంటివారమైన మనలో సువార్త అనే ఐశ్వర్యం ఎలా దాగి యున్నదో (2 కొరింథీ 4:7 “అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.”) లో వివరుస్తూ ఉన్నాడు. అల్పమైన మనము, కొన్నిసార్లు చితికిపోయిన మనం ఘటములు మన అసంపూర్ణతలకు భిన్నంగా దేవుని శక్తిని బయలుపరచగలవని పౌలు సూచిస్తున్నాడు.

మన జీవితాలలో అసంపూర్ణమైన, పగిలిన ముక్కలలో దేవుడు నివసించినప్పుడు, ఆయన శక్తి యొక్క స్వస్థపరిచే నిరీక్షణ ఇతరులకు మరింత స్పష్టముగా కనబడుతుంది. అవును, ఆయన పగిలిన మన హృదయాలను బాగుచేసే క్రమంలో తరచూ పగిలిన గురుతులను మిగిల్చియుంచుతుంది. అయితే బహుశా ఆ పగిలిన గుర్తుల వలన మనము నేర్చుకొన్నవే మన అనుదిన జీవన నడవడిలో ముద్రింపబడిన అచ్చులై ఇతరులకు ఆయన లక్షణాలను మరింత ప్రస్పుటముగా కనబడేలా చేస్తాయి. అవును, ఈ పగిలినతనం పరిపూర్ణతకు నడిపిస్తుందని జ్ఞాపకం చేసుకుందాం. ఆమెన్.

https://youtu.be/i6TMNzagtDM