Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నేనంటే నీకెందుకో.. ఈ ప్రేమ.. నన్ను మరచిపోవెందుకో.


    • నేనంటే నీకెందుకో.. ఈ ప్రేమ.. నన్ను మరచిపోవెందుకో..
    • నా ఊసే నీకెందుకో.. ఓ యేసయ్యా.. నన్ను విడిచిపోవెందుకో..
    • కష్టాలలో.. నష్టాలలో.. వ్యాధులలో.. బాధలలో..
    • కన్నీళ్లలో.. కడగళ్లలో.. వేదనలో.. శోధనలో..
    • నా ప్రాణమైనావు నీవు.. ప్రాణమా.. నా ప్రాణమా..

    • నిన్ను మరచిపోయినా.. నన్ను మరచిపోలేవు..
    • నిన్ను విడిచివెళ్లినా.. నన్ను వీడిపోలేవు..
    • ఎందుకింతప్రేమ నాపై యేసయ్యా.. ఎందుకింతప్రేమ నాపై యేసయ్యా..
    • ఏ ఋణమో.. ఈ బంధమూ.. నా ప్రేమమూర్తి.. తాళలేను నీ ప్రేమను..

    • ప్రార్ధించకపోయినా.. పలకరిస్తూ ఉంటావు..
    • మాట వినకపోయినా.. కలవరిస్తూ ఉంటావు..
    • ఎందుకింత జాలి నాపై యేసయ్యా.. ఎందుకింత జాలి నాపై యేసయ్యా..
    • ఏ ఫలమో.. ఈ బంధమూ.. నా ప్రేమమూర్తి.. తాళలేను నీ ప్రేమను..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 69264 times