ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు- ముసుకు వేసుకొనుట


  • Author: Unknown
  • Category: Messages
  • Reference: General



ఏ పురుషుడు తలమీద ముసుకు వేసుకొని ప్రార్ధన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమాన పర్చును. ఏ స్త్రీ తన తలమీద ముసుకు వేసుకొనక ప్రార్ధనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమాన పరచును.1 కొరింధి 11:4-16.

గమనించారా! పురుషుడు ఆరాధనలో ముసుకు వేసుకోకూడదు.(టోపీ/cap పెట్టుకోకూడదు) అలానే స్త్రీలు ముసుకులేకుండా ప్రార్ధన చేయకూడదు. ప్రవచింప కూడదు. ఇక్కడ ప్రార్ధన అంటే కేవలం ప్రార్ధన అనే కాదు పాటలు పాడటం, వాక్యం చెప్పడం, వినడం, ప్రార్ధన చేయడం,ఆరాధనా/worship చేయడం ఇవన్నీ ప్రార్ధన చేయడమే. చివరకి సీయోనులో మౌనముగా వుండటం కూడా స్తుతి చెల్లించడమే. అనగా సంఘంలో మౌనంగా వుండి వాక్యాన్ని వినడం కూడా దేవునికి స్తుతి చెల్లించడమే.
మరి ఇప్పుడు ఎంతమంది స్త్రీలు ప్రార్ధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, worship చేసేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, చెప్పేటప్పుడు ముసుకువేసుకొంటున్నారు?

ఈకాలంలో దేవుడు యవ్వన స్త్రీలకి మంచి తలాంతులు ఇచ్చారు. బాగా పాటలు పాడుతున్నారు. ఆరాధనా నడిపిస్తున్నారు. పరలోకాన్నే క్రిందకు దింపగలుగు తున్నారు.అందుకు దేవునికి స్తోత్రం. కాని చాల మంది పాటలు పాడేటప్పుడు సంఘాల్లోను, TV లోను ముసుగు వేసుకోవడం లేదు.ఏమంటే హెయిర్ స్టైల్ పాడైపోతుంది అంటున్నారు. దేవునికంటే వీరికి హెయిర్ స్టైల్ అనగా తమ షోకే ఎక్కువై పోయింది. 1 కొరింధి 11:3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇప్పుడు స్త్రీ తన తలమీద ముసుకులేకుండా పాడినా ప్రార్ధించినా తన తల అనగా అది యేసయ్యను అవమాన పరచినట్లే. దేవునికోసం లేక యేసయ్య కోసం లేక పరిశుద్దాత్మ కోసం స్తుతి పాటలు పాడుతూ , ముసుకు వేసుకోకుండా ఆయనని అవమాన పరచడం న్యాయమా? పరిశుద్ధాత్మను దుఃఖ పరుస్తారా?
ఇక చాలా మంది దైవ సేవకురాళ్ళు టీవీలో సంఘాల్లో వాక్యము చెబుతున్నారు. అందుకు దేవునికి స్త్రోత్రం. వారిలో చాలా మంది బైబుల్ చెప్పిన కనీస క్రమ శిక్షణను పాటించడం లేదు అనగా ముసుగు వేసుకోవడం లేదు. భోదిస్తున్న నీవే Rules & Regulations పాటించక పొతే వినే వారు పాటిస్తారా? భోదకులకి ఏడంతల శిక్ష అని మరచిపోతున్నారు. మాదిరిగా ఉండాల్సిన సేవకురాండ్రు ముసుకు వేసుకోవడం లేదు తద్వారా దేవునికి మహిమ తేవాల్సినదానికి ప్రతికూలంగా సంఘాన్ని తమ విపరీత వస్త్రధారణ ద్వారా మరియు ముసుకువేసుకోక పోవడం ద్వారా సంఘాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు.

చాలా సంఘాల్లో ఈ విషయాన్ని ఖరాఖండిగా చెప్పడం లేదు. ప్రియమైన దేవుని సేవకుడా! దయచేసి ఈ విషయాన్ని వున్నది ఉన్నట్లుగా భోదించండి. ప్రతి స్త్రీ సంఘంలో ముసుకు వేసుకోవాలి అని చెప్పండి.

కాబట్టి ప్రియ సహోదరి! నీవు ప్రార్ధన చేస్తున్నప్పుడు గాని , పాటలు పాడేటప్పుడు గాని, వాక్యం వినేటప్పుడు గాని చెప్పేటప్పుడు గాని, తప్పకుండా ముసుకు వేసుకోమని యేసయ్య నామంలో మనవి చేస్తున్నాను. సరే! నీకు ముసుకు వేసుకోవడం ఒకవేళ ఇష్టం లేదా? మంచిది! మానేయ్! గాని గుండు గీయుంచుకో! లేక పురుషులు కట్ చేసుకోనేలాగా తల కట్ చేసుకో! బాబ్డ్ హెయిర్ చేసుకో. నేను కాదు దేవుడే సెలవిచ్చారు. 11:6లో. తల కత్తిరించుకోవడం అవమానమా? అయితే ముసుకు వేసుకో! మరో దారి లేదు.
యేసు ప్రభుల వారే క్రమాన్ని పాటించినప్పుడు నీవు క్రమాన్ని పాటించలేవా? ఆయనకీ భాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అదే విషయం యోహాను గారు అడిగినప్పుడు యేసయ్య ఏమన్నారు? నీతి యావత్తు నేరవేర్చబడాలి కావున బాప్తిస్మం తీసుకొన్నారు. నీవు కూడా దేవుని ఆలయంలోనికి ఆరాధనకి వచినప్పుడు తప్పకుండా ముసుకు వేసుకోవాలి. అంతే.

కాబట్ట్టి ప్రియమైన సహోదరి! నిన్ను నీవు సరిచేసుకో! దేవుణ్ణి అవమానపరచకు. దుఃఖ పరచకు. దేవుని శాపం కాకుండా దేవుని ఆశీర్వాదం పొందుకో!

అట్టి కృప మీ అందరికి మెండుగా కలుగును గాక! దైవాశీస్సులు!
ఆమెన్.

toilax 5mg bhalsbrand.site toilax spc